Pushpa 2 Day 26 collection : అల్లు అర్జున్ మాస్ జాతర.. బాహుబలికి 4 కోట్ల దూరంలో , తగ్గేదేలే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా రూ.2000 కోట్ల టార్గెట్ దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో దంగల్, బాహుబలి 2 తర్వాతి స్థానంలో నిలిచింది. రేపో మాపో బాహుబలిని కొట్టేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 26వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 26 collections report

పుష్ప 1 బ్రాండ్‌కు తోడు సుకుమార్ టేకింగ్, జాతర సీన్‌లో అల్లు అర్జున్ గెటప్, టీజర్, ట్రైలర్లు, పాటల కారణంగా పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. గతంలో ఏ సినిమాకు లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2 ది రూల్. అలాగే ఈ సినిమా విడుదల కూడా ఓ సంచలనమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతాయి.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజ్ కావడం ఓ ఎత్తయితే.. తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి టాలీవుడ్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ని అత్యంత వేగంగా అందుకున్న చిత్రంగాను మరో రికార్డును తన ఖాతాలో వేసున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే బుక్ మై షో యాప్‌లో దాదాపు 19 మిలియన్ టికెట్ బుకింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది పుష్ప 2. అంతేకాదు బుక్ మై షో హిస్టరీలోనే ఒక సినిమా రూ. 19 మిలియన్ల టికెట్ బుకింగ్‌ను క్రాస్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Pushpa 2 The Rule Box Office Day 26 collections report

ఇక 26వ రోజు వసూళ్ల విషయానికి వస్తే బుకింగ్స్ భారీగా పడిపోయాయి. పుష్ప 2 విడుదలై నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా అతి తక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో రూ. 1.56 కోట్లు, హిందీలో రూ. 5.74 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలలో రూ.46 లక్షలు , ఓవర్సీస్‌లో రూ. 12 లక్షలు చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 8 కోట్ల వసూళ్లను సాధించింది పుష్ప 2.

26 రోజుల వరకు రూ.617 కోట్ల బిజినెస్ మీద రూ. 182 కోట్లకు పైగా లాభాలను పుష్ప 2 అందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో నాలుగు కోట్ల లాభాలను అందుకుంటే బాహుబలిని అధిగమించి టాలీవుడ్‌లో ఆల్‌టైం హయ్యెస్ట్ ప్రాఫిట్స్‌ను అందుకున్న సినిమాగా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో బాహుబలి 2.. రూ.352 కోట్ల బిజినెస్ మీద రూ.508 కోట్ల లాభాలను అందుకుని టాప్‌లో ఉంది. కాకపోతే సంక్రాంతి వరకు బరిలో మరో పెద్ద సినిమా లేకపోవడం పుష్ప 2కి ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. మరి చూద్దాం అల్లు అర్జున్ లాంగ్ రన్‌లో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తాడో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X