Pushpa 2 Day 27 collection : పుష్ప 2 డిసెంబర్ 31 ఎఫెక్ట్ .. దారుణంగా పడిపోయిన కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 విజయవంతంగా దూసుకెళ్తోంది. నాలుగు వారాలు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ తిరుగులేని విధంగా దూసుకెళ్తోంది పుష్ప 2 ది రూల్. ఈ సినిమాపై విశ్లేషకులు పెట్టిన నమ్మకాలను నిజం చేస్తూ భారీ వసూళ్లు, రికార్డులతో అల్లు అర్జున్ తన పేరిట సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 27వ రోజు పుష్ప 2 ది రూల్ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 27 collections report

మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప 2 ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. నాటి క్రేజ్‌కు తోడు జాతర సీన్‌లో అల్లు అర్జున్ గెటప్, టీజర్, ట్రైలర్లు, పాటల కారణంగా పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2 ది రూల్.

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి టాలీవుడ్ దెబ్బ ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. బుక్ మై షోలో టికెట్ల విక్రయాల విషయంలోనూ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్. అలాగే పలు ఏరియాలలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తదితర సినిమాల రికార్డులను బద్ధలుకొట్టింది.

Pushpa 2 The Rule Box Office Day 27 collections report

ఇక 26వ రోజు వసూళ్ల విషయానికి వస్తే బుకింగ్స్ భారీగా పడిపోయాయి. వరుసగా రెండో సారి పుష్ప 2కు అతి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. వర్కింగ్ డే అయినప్పటికీ సాయంత్రం పుంజుకుంటుందని అనుకున్నా డిసెంబర్ 31 ఎఫెక్ట్‌తో జనం క్లబ్బులు, పబ్‌లు, పార్టీలలో తలమునకలై థియేటర్ల వంక కన్నెత్తి చూడలేదు. తెలుగులో రూ. 1.39 కోట్లు, హిందీలో రూ. 6.86 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలలో రూ.41 లక్షలు , ఓవర్సీస్‌లో రూ. 9 లక్షలు చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 9 కోట్ల వసూళ్లను సాధించింది పుష్ప 2.

ఇదిలాఉండగా అల్లు అర్జున్‌కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు దగ్గరపడింది. ఇక్కడ ఓపెనింగ్స్ కుమ్మేయగా తర్వాత ఆశ్చర్యకరంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. గత వీకెండ్ తర్వాతి నుంచి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. కేరళలో అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా పుష్ప 2కి రూ. 20 కోట్లకి పైగా బిజినెస్ జరగ్గా.. ఇప్పటి వరకు రూ.18.10 కోట్లకు పైగా గ్రాస్, రూ.8 కోట్ల షేర్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ వారంతో పుష్ప 2 కేరళలో థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయని.. మొత్తం మీద రూ. 10 కోట్లకు మించి రాబట్టే అవకాశాలు లేవనే విశ్లేషణలు వస్తున్నాయి. అదే జరిగితే కేరళలో పుష్ప 2 భారీ డిజాస్టర్‌గా నిలుస్తుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X