Pushpa 2 Day 28 collection : పుష్ప 2కు న్యూఇయర్ ఊపు .. కుమ్మిపడేసిన అల్లు అర్జున్, ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా అప్పుడే నాలుగు వారాలను పూర్తి చేసుకుంది. 28 రోజుల్లోనే నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా రికార్డుల దుమ్ముదులిపింది పుష్ప 2. నాలుగు వారాలు గడిచినప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులతో రన్ అవుతూ మరిన్ని వసూళ్ల దిశగా దూసుకెళ్తున్నాడు పుష్ప రాజ్. ఈ నేపథ్యంలో 28వ రోజు పుష్ప 2 ది రూల్ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

పుష్ప 2 ఎప్పుడొస్తుందోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. నిజానికి ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో సినిమా విడుదల నాలుగు నెలలు ఆలస్యమైంది. అయినప్పటికీ పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అల్లు అర్జున్ లుక్, టీజర్, ట్రైలర్లు, పాటల కారణంగా పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2
ఈ సినిమా కూడా ఓ సంచలనమే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమను మరో మెట్టుపైకి ఎక్కించింది. అటు బుక్ మై షోలో టికెట్ల విక్రయాల్లోనూ గత రికార్డులను తుడిచిపెట్టేసి సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. పలు కొత్త సినిమాలు వచ్చినా అల్లు అర్జున్ మూవీని కొట్టలేకపోయాయి.

ఇక 28వ రోజు వసూళ్ల విషయానికి వస్తే న్యూ ఇయర్ ఎఫెక్ట్ సినిమాపై బాగా కనిపించింది. కొత్త సంవత్సరం తొలి రోజున కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి పుష్ప 2 థియేటర్లకు పోటెత్తారు ప్రేక్షకులు. గత కొద్దిరోజులుగా డల్‌గా ఉన్న తెలుగు, తమిళ మార్కెట్‌కు న్యూ ఇయర్ ఊపు తెచ్చింది. ఇక హిందీలోనూ కలెక్షన్స్ బాగా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా నిన్న తెలుగులో రూ.3.39 కోట్లు, హిందీలో రూ.10 కోట్లు, తమిళ్‌లో రూ. 50 లక్షలు, కేరళ , కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 12 లక్షలు చొప్పున మొత్తంగా రూ. 16 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది పుష్ప 2. మళ్లీ గురు, శుక్రవారాలు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరిగి వీకెండ్‌లో పుష్ప 2 సత్తా చాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











