Pushpa 2 Day 29 collection : అల్లు అర్జున్ మాస్ ర్యాంపెజ్ , 1800 కోట్లు ఫినిష్ .. రేపో మాపో బాహుబలి 2 ఔట్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒకదాని వెంట మరొక సినిమా రికార్డులను బద్ధలు కొడుతూ దూసుకెళ్తోంది ఈ సినిమా. మధ్యలో ఎన్ని సినిమాలు రిలీజైనప్పటికీ వాటి ప్రభావం పుష్ప 2పై ఏమాత్రం చూపించలేదు. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచేందుకు ఈ సినిమా వడివడిగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో 29వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

అల్లు అర్జున్ లుక్, టీజర్, ట్రైలర్లు, పాటల కారణంగా పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమాకు గానీ, ఏ హీరోకు గానీ లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. అంతేకాడు.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి టాలీవుడ్ స్టామినా ఏంటో చూపించింది.
మరి ముఖ్యంగా పుష్ప 2 దెబ్బకి బీటౌన్ షేక్ అవుతోంది. హిందీ సినిమాలు 100 కోట్లు కొట్టడానికే నానా తంటాలు పడుతుంటే పుష్ప రాజ్ అలవోకగా కోట్లకు కోట్లు కొల్లగొడుతుండటంతో బాలీవుడ్ మేకర్స్‌కి ఏం అర్ధం కావడం లేదు. కలెక్షన్ల విషయంలోనే కాదు.. అటు బుక్ మై షోలో టికెట్ల విక్రయాల్లోనూ గత రికార్డులను తుడిచిపెట్టేశాడు అల్లు అర్జున్. ఆ ఒక్క వెబ్‌సైట్‌లోనే 19 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అవ్వగా.. మిగిలిన ఫ్లాట్ ఫాంమ్స్‌లో ఏ రేంజ్‌లో బిజినెస్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక 29వ రోజు వసూళ్ల విషయానికి వస్తే న్యూ ఇయర్ రోజు ప్రపంచవ్యాప్తంగా సాలీడ్ బుకింగ్స్ అందుకున్న పుష్ప 2.. వర్కింగ్ డే అయిన గురువారం అంతగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే తెలుగులో వసూళ్లు పడిపోయినా .. హిందీ మాత్రం అల్లు అర్జున్ సినిమాను ఆదుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న తెలుగులో రూ.1.32 కోట్లు, హిందీలో రూ.4.23 కోట్లు, తమిళ్, కేరళ , కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 41 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 7 లక్షలు చొప్పున మొత్తంగా రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది పుష్ప 2.
మొత్తంగా 29 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో 5వ వారంలో బాహుబలి 2 వసూళ్ల రికార్డును పుష్ప 2 బద్ధలుకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శుక్రవారం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటంతో పుష్ప 2 తిరిగి సత్తా చాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











