Pushpa 2 Day 3 collection : అల్లు అర్జున్ విధ్వంసం ఇలా ఉంటదా .. మూడు రోజుల్లోనే 500 కోట్లు ఫట్?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఖచ్చితంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలు కొడుతుందని ట్రేడ్ పండితులు ముందే అంచనా వేశారు. వారు చెప్పినట్లుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది పుష్ప 2. రెండ్రోజుల్లోనే రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లతో అల్లు అర్జున్ తన పేరిట సరికొత్త రికార్డులు సృష్టించాడు.

మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్ ( పుష్ప పార్ట్ 1 ) యావత్ దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడొస్తుంది? అంటూ తెలుగు ఆడియన్స్‌ కంటే నార్త్ ఆడియన్స్ ఎదురుచూశారు. దీనికి తెరదించుతూ పుష్ప 2 ది రూల్‌ని తీసుకొచ్చాడు సుకుమార్. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో భారీ హైప్ రావడంతో ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్‌కు విపరీతమైన పోటీ నెలకొంది. తద్వారా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Pushpa 2 The Rule Box Office Day 3 collections report

రూ. 620 కోట్ల షేర్.. రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 తొలి రోజు ఏకంగా రూ.294 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి కుమ్మిపడేసింది పుష్ప 2. రెండో రోజు రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో మొత్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు అల్లు అర్జున్. అయితే తెలుగులో కంటే కూడా హిందీలో సాలీడ్ కలెక్షన్స్‌ను అందుకుంటోంది ఈ మూవీ. హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. బాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాడు బన్నీ.

రెండు రోజుల కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. బాహుబలి పార్ట్ 1 రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తర్వాత ఆర్ఆర్ఆర్, బాహుబలి ఉండగా ఇప్పుడు ఆ రికార్డును పుష్ప 2 తిరగరాసింది. రెండ్రోజుల్లోనే ఏకంగా రూ. 425 కోట్ల కలెక్షన్స్‌తో విధ్వంసం సృష్టించింది. ఇక మూడో రోజు శనివారం వీకెండ్ కావడంతో మధ్యాహ్నం నుంచే అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. సీ క్లాస్ సెంటర్‌లోనూ ఫస్ట్, సెకండ్ షోలకు సాలీడ్ బుకింగ్స్ అందుకోవడం విశేషం.

Pushpa 2 The Rule Box Office Day 3 collections report

తెలుగు రాష్ట్రాల్లో రూ. 32 కోట్లు , హిందీలో రూ.75 కోట్లు, తమిళనాడులో రూ. 10 కోట్లు, కర్ణాటకలో రూ.8 కోట్లు, కేరళ, రెస్టాఫ్ ఇండియాలలో రూ. 8 కోట్లు చొప్పున మొత్తంగా మూడో రోజు ఇండియా వైడ్‌గా రూ. 130 కోట్లను రాబట్టింది. దీనికి ఓవర్సీస్ కలెక్షన్స్‌ రూ. 20 కోట్లతో మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాడు అల్లు అర్జున్. తద్వారా మూడు రోజుల వరకు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 520 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక నాలుగో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం మరి అల్లు అర్జున్ ఎలాంటి మేజిక్ చేస్తాడో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X