Pushpa 2 Day 30 collection: దారుణంగా పడిపోయిన వసూళ్లు, ఇంత వీక్‌గానా?..పుష్ప 2కి ఎన్ని కోట్లంటే?
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ దిగ్విజయంగా నెల రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ 30 రోజుల్లో నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా వసూళ్ల వర్షం కురిపించింది పుష్ప 2. ప్రస్తుతం రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లతో ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ మూవీ బాహుబలి 2 రికార్డులను బద్ధలు కొట్టడానికి దగ్గరగా వచ్చింది. రేపో మాపో ఆ ఫీట్‌ను అందుకోవడానికి అల్లు అర్జున్ రెడీ అయ్యాడు. మరి 30వ రోజు పుష్ప 2 ది రూల్ ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ లుక్, టీజర్, ట్రైలర్లు, పాటల కారణంగా పుష్ప 2పై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు పుష్ప ది రైజ్ క్రేజ్ కారణంగా ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. అంతేకాడు.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి టాలీవుడ్ సత్తా చూపించింది.
ఇక 30వ రోజు వసూళ్ల విషయానికి వస్తే న్యూ ఇయర్ ఎఫెక్ట్‌తో మంచి రాబడి సాధించిన పుష్ప 2.. గురు, శుక్రవారాల్లో మాత్రం డల్ అయ్యింది. అయితే తెలుగులో ఊసూరుమనిపించినా .. హిందీ బెల్ట్ మాత్రం ఈ సినిమాను ఆదుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న తెలుగులో రూ.1.08 కోట్లు, హిందీలో రూ.3 కోట్లు, తమిళ్, కేరళ , కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 23 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 5 లక్షలు చొప్పున మొత్తంగా రూ. 4.62 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది పుష్ప 2. మొత్తంగా 30 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్ ప్రాఫిట్స్‌ను అందుకున్న రెండో చిత్రంగా పుష్ప 2 నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా 30 రోజుల్లో రూ. 617 కోట్ల బిజినెస్ మీద ఏకంగా రూ.200 కోట్లకు పైగా లాభాలను అందించింది పుష్ప 2. అంతేకాదు .. దాదాపు రూ.600 కోట్లకు పైగా బిజినెస్ చేసినా ఈ స్థాయిలో ప్రాఫిట్స్‌ను రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక శనివారం నుంచి 5వ వీకెండ్ ప్రారంభం కానుండటంతో పుష్ప 2 తిరిగి సత్తా చాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి అల్లు అర్జున్ ఎలాంటి మేజిక్ చేస్తాడో.


Click it and Unblock the Notifications











