Pushpa 2 Day 31 collection : పనిచేయని అల్లు అర్జున్ మేజిక్, ఎండ్ కార్డ్ దిశగా పుష్ప 2 .. కలెక్షన్స్ ఎంతంటే?
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ 5వ వారంలోకి ప్రవేశించినప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. న్యూ ఇయర్ వరకు రోజుకు రూ.10 కోట్లు తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత రెండు రోజులు మాత్రం తన మేజిక్ చూపించలేకపోయారు. ప్రస్తుతం వీకెండ్ నేపథ్యంలో పుష్ప 2 ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

పుష్ప 1 బ్రాండ్ నేపథ్యంలో పుష్ప 2కి దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా.. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు ఈ హైప్‌ను మరింత పెంచేశాయి. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో గతంలో ఏ సినిమాకు లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. అంతేకాడు.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమ స్టామినా ఏంటో చూపించింది.
ఇక 31వ రోజు వసూళ్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.08 కోట్లు, హిందీలో రూ. 4.54 కోట్లు, తమిళ్, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.36 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2. ఆదివారంతో వీకెండ్ ముగియనుండటంతో అల్లు అర్జున్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.
ఇకపోతే.. పుష్ప 2కి హిందీ బెల్ట్ ఎలా కనెక్ట్ అయ్యిందో వస్తున్న కలెక్షన్స్‌ను బట్టి చెప్పొచ్చు. ఇప్పటికే ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసింగ్ హిందీ సినిమాగా ఓ డబ్బింగ్ మూవీ అయిన పుష్ప 2 రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో పుష్ప 2 అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ రాష్ట్రంలో రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు సొంత బెంగాలీ సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. 2017లో అమేజాన్ ఓర్బిజాన్ అనే చిత్రం రూ. 48 కోట్లతో ఈ రికార్డును తన పేరిట రాసుకుంది. దాదాపు 7 ఏళ్ల తర్వాత దానిని అల్లు అర్జున్ బద్ధలు కొట్టడం విశేషం. తెలుగు సహా మిగిలిన సౌత్ మార్కెట్స్‌లో పుష్ప థియేట్రికల్ రన్ ఆల్‌మోస్ట్ ఎండింగ్ స్టేజ్‌కు రాగా.. హిందీలో వసూళ్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











