Pushpa 2 Day 32 collection : వీకెండ్ ఎఫెక్ట్ నిల్ .. డల్‌గా పుష్ప 2 కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే ?
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ బిజినెస్‌కి ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరపడింది. గడిచిన నెల రోజులుగా ఎదురు లేకుండా సాగిన పుష్పపై ఈ వారం సంక్రాంతి సినిమాల ఎఫెక్ట్ పడనుంది. 5వ వీకెండ్ పూర్తి చేసుకున్న పుష్ప 2 ది రూల్.. 32వ రోజు ఎలాంటి వసూళ్లు సాధించిందో పరిశీలిస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

పుష్ప 1 క్రేజ్‌కి తోడు అల్లు అర్జున్‌పై వచ్చిన గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్‌లు పుష్ప 2కి ఎక్కడా లేని హైప్‌ను తీసుకొచ్చాయి. చిత్ర యూనిట్ కూడా చివరిలో ప్రమోషన్ కార్యక్రమాలు దంచికొట్టడంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడ్డారు. ఇవన్నీ కలిసొచ్చి గతంలో ఏ సినిమాకు లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి టాలీవుడ్ పేరిట మరో రికార్డు నెలకొల్పింది.
ఇక 32వ రోజు వసూళ్ల విషయానికి వస్తే వీకెండ్ కారణంగా పుష్ప 2 నార్త్, సౌత్‌లలో బాగానే హోల్డ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.27 కోట్లు, హిందీలో రూ. 6 కోట్లు, తమిళ్, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.42 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 5 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 8 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2.
ఇకపోతే.. పుష్ప 2కి హిందీ బెల్ట్ ఎలా కనెక్ట్ అయ్యిందో వస్తున్న కలెక్షన్స్‌ను బట్టి చెప్పొచ్చు. ఇప్పటికే ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసింగ్ హిందీ సినిమాగా ఓ డబ్బింగ్ మూవీ అయిన పుష్ప 2 రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ మూవీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హిందీలో కలెక్షన్స్ రూ.800 కోట్లకు చేరుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. 31 రోజుల్లో రూ.806 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న తొలి చిత్రంగా పుష్ప 2 నిలిచింది.
Brand #Pushpa inagurates 𝟖𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄 CLUB in Hindi ❤🔥#Pushpa2TheRule has a RECORD BREAKING COLLECTION in Hindi with 𝟖𝟎𝟔 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐍𝐄𝐓𝐓 in 31 days 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2025
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun… pic.twitter.com/bRAgO99ygp
కాగా.. ఈ శుక్రవారం నుంచి వరుసపెట్టి సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానున్నాయి. జనవరి 10న గేమ్ ఛేంజర్, జనవరి 12న డాకు మహారాజ్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో వారంతో పుష్ప 2 ప్రయాణం ముగుస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











