Pushpa 2 Day 33 collection : చేతులెత్తేసిన అల్లు అర్జున్ .. ఇంత దారుణంగానా, ఎన్ని కోట్లంటే?
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానంలో ఉన్న బాహుబలి 2ని అధిగమించి రూ.1831 కోట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం 5వ వారంలోకి అడుగుపెట్టిన పుష్ప 2కు చాలా వరకు బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. గత వీకెండ్‌లో మంచి హోల్డ్ సాధించిన అల్లు అర్జున్ మూవీ.. సోమవారం ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్ దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా కావడంతో పుష్ప 2 ది రూల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక జాతర సీన్‌లో అల్లు అర్జున్ గెటప్ , పాటలు, టీజర్, ట్రైలర్‌లు పుష్ప 2 క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అలా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2.
గతంలో ఏ సినిమాకు లేని విధంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. మిగిలిన ఏరియాలో సంగతి ఏమో కానీ పుష్ప 2కి నార్త్ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా బాలీవుడ్ సినిమాలనే పక్కనపెట్టింది. 31 రోజుల్లో రూ.806 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న తొలి చిత్రంగా పుష్ప 2 నిలిచింది.
ఇక 33వ రోజు వసూళ్ల విషయానికి వస్తే వీకెండ్‌లో కుమ్మేసిన పుష్ప 2.. సోమవారం వర్కింగ్ డే కారణంగా భారీగా డ్రాప్స్‌ను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 62 లక్షలు, హిందీలో రూ. 2 కోట్లు, తమిళ్, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో 38 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 3.5 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి రూ.5 కోట్ల కంటే తక్కువ గ్రాస్ కలెక్షన్స్ రావడంతో ఇదే తొలిసారి. మరో రెండ్రోజుల్లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్ బిజినెస్ దాదాపు ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి మొత్తంగా అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్ల మేర వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











