Pushpa 2 Day 34 collection : దెబ్బేసిన వసూళ్లు .. పుష్ప 2కి ఎన్ని కోట్లంటే? ఇక ఆ 20 నిమిషాలపైనే ఆశలు
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ రూన్ ఎండింగ్ స్టేజ్‌కు వచ్చినట్లుగా పరిస్ధితులు కనిపిస్తున్నాయి. 5వ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా వీకెండ్‌లో బాగానే హోల్డ్ చేసినప్పటికీ సోమవారం నుంచి మాత్రం వసూళ్లు పడిపోయాయి. దీనికి తోడు సంక్రాంతి సినిమాల హవా మొదలు కానుండటంతో పుష్ప 2 థియేట్రికల్ బిజినెస్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో 34వ రోజు అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించిందో ఒకసారి చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

అల్లు అర్జున్ - త్రివిక్రమ్‌ల కాంబోలో మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప దేశాన్ని ఏ స్థాయిలో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పుష్ప 2 ది రూల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జాతర సీన్‌లో అల్లు అర్జున్ గెటప్ , పాటలు, టీజర్, ట్రైలర్‌లు దీనిని మోస్ట్ అవైటెడ్ సీక్వెల్‌గా మార్చేశాయి. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. అలా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2.
ట్రేడ్ పండితుల అంచనాలను నిజం చేస్తూ పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండ్రోజుల క్రితం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 రికార్డును కూడా బద్ధలుకొట్టేసింది పుష్ప 2. రాజమౌళి చిత్రం తన టోటల్ లాంగ్ రన్‌లో రూ. 1810 కోట్ల వసూళ్లు సాధించగా.. పుష్ప 2 కేవలం 32 రోజుల్లోనే రూ. 1831 కోట్లు రాబట్టి సత్తా చాటింది. తద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానంలో, అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా, అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా పుష్ప 2 ది రూల్ నిలిచింది.
ఇక 34వ రోజు వసూళ్ల విషయానికి వస్తే వరుసగా రెండో రోజు వర్కింగ్ డే కారణంగా భారీగా డ్రాప్స్‌ను నమోదు చేసింది పుష్ప 2. తెలుగు రాష్ట్రాల్లో రూ. 65 లక్షలు, హిందీలో రూ. 1.86 కోట్లు, తమిళ్, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో 27 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 3 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2. మరో రెండ్రోజుల్లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్ బిజినెస్ దాదాపు ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అయితే పండగ సెలవుల్ని క్యాష్ చేసుకునేందుకు పుష్ప మేకర్స్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. పుష్ప 2కి మరో 20 నిమిషాల రన్ టైంను యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 11 నుంచి రీలోడ్ వెర్షన్ థియేటర్‌లో ఉంటుందని ప్రొడ్యూసర్స్ తెలిపారు. తెలుగులో సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకోవడానికి ఈ రీ లోడెడ్ వెర్షన్ పర్ఫెక్ట్‌గా హెల్ప్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











