Pushpa 2 Day 35 collection : దారుణంగా పుష్ప 2 పరిస్ధితి .. మరోసారి హెవీ డ్రాప్స్, ఎన్ని కోట్లంటే?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 1840 కోట్లకు పైగా వసూళ్లతో వడివడిగా రూ.2000 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాడు పుష్పరాజ్. 32 రోజుల వరకు ఎదురులేకుండా సాగిన అల్లు అర్జున్ గత సోమవారం నుంచి మాత్రం తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో 35వ రోజు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 35 Collections report

ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్‌‌కు భారీ ధర పలికింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లు లక్ష్యంగా బరిలోకి దిగిన ఈ సినిమా తొలి రోజే రికార్డు స్థాయిలో రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ట్రేడ్ పండితుల అంచనాలను నిజం చేస్తూ పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.

తాజాగా బాహుబలి 2 (రూ.1810 కోట్లు) వసూళ్ల రికార్డును కూడా బద్ధలుకొట్టేసింది పుష్ప 2. కేవలం 32 రోజుల్లోనే ఏకంగా రూ. 1831 కోట్లు రాబట్టడమే కాదు. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానంలో, అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా, అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా పుష్ప 2 ది రూల్ నిలిచింది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో పుష్ప 2 కోసం దాదాపు 20 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయినట్లుగా ట్రేడ్ వర్గాల అంచనా. ఈ విషయంలో ఏ ఇతర భారతీయ చిత్రం కూడా పుష్ప 2 దరిదాపుల్లో లేదు.

ఇక 35వ రోజు వసూళ్ల విషయానికి వస్తే వరుసగా మూడో రోజు వర్కింగ్ డే కారణంగా భారీగా డ్రాప్స్‌ను నమోదు చేసింది పుష్ప 2. తెలుగు రాష్ట్రాల్లో రూ. 56 లక్షలు, హిందీలో రూ. 1.92 కోట్లు, తమిళ్, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో 20 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 2.90 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2. మరో రెండ్రోజుల్లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ పోటీని తట్టుకుని పుష్ప 2 ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Pushpa 2 The Rule Box Office Day 35 Collections report

అయితే ఇక్కడే పుష్ప 2 దర్శక నిర్మాతలు తెలివిగా వ్యవహరించారు. ఈ సినిమాకు మరో 20 నిమిషాల రన్ టైంను యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్‌ పేరిట జనవరి 11 నుంచి అందుబాటులో ఉంచారు. ట్రైలర్‌లో ఉన్న కొన్ని సీన్లు సినిమాలో లేవని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. సినిమా నిడివి ఇప్పటికే మూడున్నర గంటలకు చేరుకున్న నేపథ్యంలో కొన్ని సీన్లను కట్ చేశారు.

అయితే సంక్రాంతి నేపథ్యంలో కట్ చేసిన 20 నిమిషాల ఫుటేజ్‌ను యాడ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఏ సీన్లు కలిపారో చూడాలని ప్రేక్షకులు కూడా ఎగ్జయిటింగ్‌తో ఉన్నారు. తెలుగులో సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకోవడానికి ఈ రీ లోడెడ్ వెర్షన్ పర్ఫెక్ట్‌గా హెల్ప్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం హిందీ బెల్ట్‌లో పుష్ప‌ వసూళ్లను మరింత పెంచుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X