Pushpa 2 Day 36 collection: థియేటర్లలోకి గేమ్ ఛేంజర్..పుష్ప 2 కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన నాటి నుంచి ఒక్కో సినిమా రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ బాహుబలి 2ని అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రూ.1850 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన పుష్ప 2 .. 36వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లను రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 36 Collections report

ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప 2కు ట్రేడ్ పండితులు రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్లను బ్రేక్ ఈవెన్‌గా విలువ కట్టారు. అందరి అంచనాలను నిజం చేస్తూ తొలి రోజే ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పాడు అల్లు అర్జున్ . ట్రేడ్ పండితుల అంచనాలను నిజం చేస్తూ పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టి భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇక 36వ రోజు వసూళ్ల విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదలైంది. చెర్రీ సినిమా కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లు గేమ్ ఛేంజర్‌కి వెళ్లాయి. పుష్ప 2ను దాదాపు 80 శాతం థియేటర్లలో లేపేశారు. ఈ ప్రభావం సినిమాపై గట్టిగానే పడినట్లుగా తెలుస్తోంది. గురువారం తెలుగులో రూ. 31 లక్షలు, హిందీలో రూ. 1.52 కోట్లు, తమిళ్, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో 15 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 2.38 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2.

Pushpa 2 The Rule Box Office Day 36 Collections report

గేమ్ ఛేంజర్ ఆల్రెడీ థియేటర్‌లలో ఉండగా జనవరి 12న నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, జనవరి 14న విక్టరీ వెంకటేష్‌లు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ కారణంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే పుష్ప 2కి మరో 20 నిమిషాల రన్ టైంను యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్‌ పేరిట జనవరి 11 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దీంతో ఏ సీన్లు కలిపారో చూడాలని ప్రేక్షకులు కూడా ఎగ్జయిటింగ్‌తో ఉన్నారు. తెలుగులో సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకోవడానికి ఈ రీ లోడెడ్ వెర్షన్ పర్ఫెక్ట్‌గా హెల్ప్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయం హిందీ బెల్ట్‌లో పుష్ప‌ 2 ది రూల్ వసూళ్లను మరింత పెంచుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X