Pushpa 2 Day 37 collection : పుష్ప 2ని దెబ్బకొట్టిన గేమ్ ఛేంజర్ .. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ఆరో వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. విడుదలైన నాటి నుంచి రోజుకు రూ. 5 కోట్ల గ్రాస్ తగ్గకుండా గ్రాస్ రాబట్టిన పుష్ప2కి ఆరో వారం నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇక సంక్రాంతి సినిమాలలో భాగంగా రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ నుంచి పోటీ ఎదురైంది. మరి ఈ పోరాటంలో పుష్ప 2 ఎలాంటి వసూళ్లు రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 37 Collections report

టీజర్, ట్రైలర్‌లతో పాటు పుష్ప పార్ట్ 1పై క్రేజ్ దృష్ట్యా .. ఈ సినిమా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో పుష్ప 2కు ట్రేడ్ పండితులు రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌గా విలువ కట్టారు. అందరి అంచనాలను నిజం చేస్తూ తొలి రోజే ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పాడు అల్లు అర్జున్ . ఆ తర్వా ఫస్ట్ వీక్‌లో రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టింది పుష్ప 2.

ఇక నార్త్ ఇండియాలో రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది పుష్ప 2 ది రూల్. అలాగే 32 రోజుల్లో రూ. 1831 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో ఉన్న బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టింది. ఇప్పుడు అదే జోష్‌లో రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరాలని వడి వడిగా అడుగులు వేస్తోంది పుష్ప 2. ఇలాంటి దశలో సంక్రాంతికి బడా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అల్లు అర్జున్ సినిమాపై గట్టి ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pushpa 2 The Rule Box Office Day 37 Collections report

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదలైంది. ఈ సినిమా కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లు గేమ్ ఛేంజర్‌కి వెళ్లాయి. ఈ నేపథ్యంలో 37వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే. తెలుగులో రూ. 23 లక్షలు, హిందీలో రూ. 1.12 కోట్లు, తమిళ్, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో 10 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 1.94 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2. పరిస్ధితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయినట్లే కనిపిస్తోంది.

మరోవైపు జనవరి 12న నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, జనవరి 14న విక్టరీ వెంకటేష్‌లు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే పుష్ప 2కి మరో 20 నిమిషాల రన్ టైంను యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్‌ పేరిట జనవరి 11 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకోవడానికి ఈ రీ లోడెడ్ వెర్షన్ పర్ఫెక్ట్‌గా హెల్ప్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది నార్త్‌లో వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X