Pushpa 2 Day 38 collection : గట్టెక్కించని 20 నిమిషాలు.. దారుణంగా పుష్ప 2 వసూళ్లు, ఎన్ని కోట్లంటే?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ విజయవంతంగా ఆరో వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే సంక్రాంతి సినిమాల పోటీ మొదలవ్వగా.. జనవరి 11 నుంచి అదనంగా మరో 20 నిమిషాల ఫుటేజ్ కలిపిన నేపథ్యంలో పుష్ప 2 ది రూల్ ‌38వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది? టఫ్ ఫైట్‌లోనూ అల్లు అర్జున్ సత్తా చాటాడా? ఈ వివరాలు పరిశీలిస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 38 Collections report

టీజర్, ట్రైలర్‌లతో పాటు దేశాన్నే ఊపేసిన పుష్ప పార్ట్ 1పై క్రేజ్ దృష్ట్యా .. పుష్ప 2 ది రూల్ 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో పుష్ప 2కు ట్రేడ్ పండితులు రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌గా విలువ కట్టారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమా తొలి రోజే ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 294 కోట్ల వసూళ్లు సాధించింది . ఆ తర్వాత తొలి వారంలో రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు రాబట్టింది పుష్ప 2.

ఇక నార్త్ ఇండియా మొత్తం పుష్ప 2 ఫీవర్‌తో ఊగిపోతోంది. ఖాన్‌లు, కపూర్‌లు కూడా సాధించని రేంజ్‌లో ఇప్పటి వరకు రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది పుష్ప 2 ది రూల్. బాహుబలి 2 రికార్డును కూడా బద్ధలుకొట్టి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా, దక్షిణాది చిత్రంగానూ నిలిచింది. ప్రస్తుతం రూ.2 వేల కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తున్న పుష్ప 2కు సంక్రాంతి సినిమాలు షాకిస్తున్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదలవ్వగా, 12 నుంచి నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ వచ్చింది. ఇంతటి టఫ్ కండీషన్‌ను తట్టుకోవడానికి పుష్ప 2 మేకర్స్ అదనంగా 20 నిమిషాల ఫుటేజ్‌ను యాడ్ చేసినట్లుగా ఫిలింనగర్ జనాలు చెవులు కోరుక్కుంటున్నారు. మరి ఈ నిర్ణయం ఎంత వరకు అడ్వాంటేజ్ అయ్యిందో చూస్తే . 38వ రోజు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 2.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్‌తో పాటు సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పుష్ప 2 పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X