Pushpa 2 Day 39 collection : అల్లు అర్జున్‌కి దెబ్బేసిన రామ్ చరణ్ ..పడిపోయిన వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ సంక్రాంతి సీజన్‌ను కూడా కొల్లగొట్టాలని గట్టిగా ప్లాన్ చేసింది. ఇందుకోసం అదనంగా 20 నిమిషాల ఫుటేజ్‌ను యాడ్ చేసింది. అయితే సంక్రాంతి సినిమాలు రిలీజ్ కావడంతో పుష్ప 2 గట్టి పోటీని ఎదుర్కొంటోంది. మరి ఈ టఫ్ ఫైట్‌లో 39వ రోజు అల్లు అర్జున్ ఎలాంటి వసూళ్లు సాధించాడో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

జాతర సీన్‌లో అల్లు అర్జున్ గెటప్, పాటలు, టీజర్, ట్రైలర్‌లతో పుష్ప 2 ది రూల్‌పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ హైప్ దృష్ట్యా పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. తద్వారా ఏకంగా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దాంతో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని నిర్దేశించారు.
డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమా తొలి రోజే ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది . అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు సాధించింది పుష్ప 2.

అల్లు అర్జున్‌కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాలను మించి నార్త్‌లో పుష్ప 2కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు . ఇప్పటి వరకు రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ చిత్రంగా అరుదైన ఘనతను సాధించింది పుష్ప 2 ది రూల్. దాదాపు ఏడేళ్లుగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా, దక్షిణాది చిత్రంగా నిలిచిన బాహుబలి 2 రికార్డును బద్ధలుకొట్టింది. ప్రస్తుతం రూ.2 వేల కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తున్న పుష్ప 2కు సంక్రాంతి సినిమాలు షాకిస్తున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదలవ్వగా, 12 నుంచి నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ వచ్చింది. ఈ పోటీని ఎదుర్కోవడానికి పుష్ప 2 మేకర్స్ అదనంగా 20 నిమిషాల ఫుటేజ్‌ను తీసుకొచ్చారని వినికిడి. ఇక 39వ రోజు వసూళ్ల విషయానికి వస్తే .. సంక్రాంతి సీజన్ స్టార్టింగ్‌లోనే అల్లు అర్జున్‌కు షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ థియేటర్లు చెర్రీ, బాలయ్య మూవీలకు వెళ్లిపోవడంతో పుష్ప 2కు స్క్రీన్లు తగ్గాయి.
దాని ప్రభావం వసూళ్ల విషయంలో కనిపించింది. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో రూ.30 లక్షలు రాగా.. హిందీలో రూ.2.34 కోట్లు, తమిళ్, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో రూ. 12 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4 లక్షల చొప్పున మొత్తంగా రూ.2.60 కోట్లను రాబట్టింది పుష్ప 2. దీనిని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ మూవీకి బిజినెస్ ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











