Pushpa 2 Day 4 collection : 700 కోట్లతో అల్లు అర్జున్ హిస్టరీ.. బాహుబలి ఔట్ , నాలుగో రోజు ఎన్ని కోట్లంటే?
మూడేళ్ల క్రితం సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 1కి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 ది రూల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.600 కోట్ల వసూళ్లను బాది పారేసింది. దీంతో ఈ సినిమా బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలు కొడుతుందా అంటూ ఇండస్ట్రీ, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి నాలుగో రోజు పుష్ప 2 ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాల్లోకి వెళితే..
పుష్ప 2 ది రూల్‌లో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో భారీ హైప్ రావడంతో ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్‌కు విపరీతమైన పోటీ నెలకొంది. తద్వారా ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

రూ. 620 కోట్ల షేర్.. రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వేల థియేటర్‌లలో రిలీజైంది. నాలుగు రోజుల్లోనే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పుష్ప2 చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఫాస్టెస్ట్‌గా రూ. 600 కోట్ల గ్రాస్ మార్క్‌ని అందుకున్న మూవీగా పుష్ప 2 రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు 2017లో వచ్చిన బాహుబలి 2 పేరిట ఉండేది. ఈ రాజమౌళి సినిమా కేవలం 4 రోజుల్లోనే రూ.600 కోట్ల గ్రాస్ మార్క్‌ని అందుకుంటే.. పుష్ప 2 ది రూల్ 3 రోజుల్లోనే ఆ మార్క్‌ని క్రాస్ చేసింది.
ఇక మూడు రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ మూవీస్‌లో పుష్ప 2 (రూ.594 కోట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి 2 (509 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.496 కోట్లు), కేజీఎఫ్ చాప్టర్ 2 ( రూ.430.20 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.380.70 కోట్లు), సలార్ (రూ.330 కోట్లు) నిలిచాయి. పుష్ప 2 దూకుడు ఇలాగే కొనసాగితే లాంగ్ రన్‌లో బాహుబలి 2 తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆదివారం వీకెండ్ కావడంతో ఉదయం నుంచే అన్ని చోట్లా సాలీడ్ బుకింగ్స్ జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 46 కోట్లు, హిందీలో రూ.90 కోట్లు, కర్ణాటకలో రూ.8 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 20 కోట్లు చొప్పున మొత్తంగా నాలుగో రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు అల్లు అర్జున్. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా మార్క్‌ని అందుకున్న మూవీగా పుష్ప 2 నిలిచింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో కలెక్షన్స్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పుష్ప రాజ్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











