Pushpa 2 Day 40 collection : కిక్క్ ఇవ్వని ఆ 20 నిమిషాలు .. షాకిచ్చేలా పుష్ప 2 వసూళ్లు , ఎన్ని కోట్లంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ విజయవంతంగా 40 రోజుల మార్క్‌ను పూర్తి చేసుకుంది. విడుదలైన నాటి నుంచి నేటి వరకు ఒక్కో సినిమా రికార్డును బద్ధలు కొడుతూ దూసుకెళ్లింది. స్త్రీ, కల్కి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్లను దాటుకుంటూ సరికొత్త బెంచ్ మార్క్‌లు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో 40వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

జాతర సీన్‌లో అల్లు అర్జున్ గెటప్, పాటలు, టీజర్, ట్రైలర్‌లతో పుష్ప 2 ది రూల్‌పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి. ఈ కారణంగా పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పుష్ప 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని నిర్దేశించారు.
భారీ టార్గెట్‌తో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 .. ఓపెనింగ్ డేనే హిట్టు కొట్టింది. ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్ వైపు యావత్ దేశం చూసేలా చేసింది. ఇక అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు సాధించింది పుష్ప 2.

నార్త్ ఆడియన్స్ మాత్రం పుష్ప 2కు కనెక్ట్ అయిపోయారు. తెలుగులో బుకింగ్స్ డ్రాప్ అయినప్పటీకి హిందీలో వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఖాన్‌లు, కపూర్‌లకే సాధ్యం కానీ రేంజ్‌లో రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద హవా చూపించిన పుష్ప 2 .. గడిచిన వారం రోజులుగా తన జోరు కొనసాగించలేకపోతోంది. దీనికి కారణం సంక్రాంతి సినిమాలు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌లు థియేటర్‌లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ పుష్ప 2కు స్క్రీన్లు తగ్గాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఎక్స్‌ట్రా 20 మినిట్స్ ఫుటేజ్‌ను ఈ సినిమాకు కలిపారు. దీని ప్రభావం తెలుగులో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుందని వస్తోన్న కలెక్షన్సే చెబుతున్నాయి. అయితే 40వ రోజు మాత్రం పుష్ప 2 వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ.23 లక్షలు రాగా.. తొలిసారిగా హిందీలో కోటి లోపే (రూ.86 లక్షలు) వసూళ్లు రావడం గమనార్హం. ఇక తమిళ్, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2 లక్షల చొప్పున మొత్తంగా రూ.1.30 కోట్లను రాబట్టింది పుష్ప 2. దీనిని బట్టి చూస్తే అల్లు అర్జున్ మూవీకి బిజినెస్ ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











