Pushpa 2 Day 41 collection : టఫ్ ఫైట్‌లో నిలబడ్డ పుష్ప 2 .. కుమ్మేసిన వసూళ్లు, ఎన్ని కోట్లంటే?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ బిజినెస్‌కు ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని అనుకున్న చిత్ర యూనిట్‌కు పరిస్ధితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా చేతులెత్తేసిన పుష్ప 2కు ఆశ్చర్యకరంగా హిందీ బెల్ట్‌లోనూ స్కోప్ దక్కడం లేదు . ఈ నేపథ్యంలో 41వ రోజు పుష్ప 2కి ఎన్ని కోట్ల వసూళ్లు దక్కాయో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 41 Collections report

మూడేళ్ల క్రితం దేశాన్ని ఊపేసిన పుష్ప ది రైజ్ బ్రాండ్‌కు తోడు పాటలు, టీజర్, ట్రైలర్, అల్లు అర్జున్ - రష్మికల గెటప్‌‌లతో పుష్ప 2 ది రూల్‌పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పుష్ప 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని నిర్దేశించారు.

కొండంత లక్ష్యంతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 .. ఓపెనింగ్ డేనే హిట్టు కొట్టింది. ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్‌ వైపు యావత్ దేశం చూసేలా చేసింది. ఇక అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు సాధించింది పుష్ప 2.

Pushpa 2 The Rule Box Office Day 41 Collections report

దాదాపు 32 రోజుల పాటు రోజుకు రూ.5 కోట్లు తగ్గకుండా గ్రాస్ సాధించిన పుష్ప 2.. గత కొద్దిరోజులుగా మాత్రం బుకింగ్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. తెలుగులో పడిపోయినా నార్త్ .. అల్లు అర్జున్ సినిమాకు అండగా నిలిచింది. ఎప్పుడైతే సంక్రాంతి సినిమాలు రిలీజయ్యాయో నాటి నుంచి తెలుగులో పుష్ప 2కి బుకింగ్స్ పూర్తిగా పడిపోవడంతో పాటు మెజారిటీ థియేటర్లు కూడా కోల్పోయింది. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌లు థియేటర్‌లో ఉండగా.. జనవరి 14వ తేదీ విక్టరి వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం కూడా బరిలో దిగింది.

ఎక్స్‌ట్రా 20 నిమిషాల ఫుటేజ్‌ను కలిపినా.. పెద్దగా వర్కవుట్ కాలేదని విశ్లేషకులు అంటున్నారు. సోమవారం నుంచి పుష్ప 2 వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. ఇన్నాళ్లు అండగా నిలిచిన హిందీ బెల్ట్ కూడా పట్టించుకోకపోవడం చిత్ర యూనిట్‌కు షాకిస్తోంది. అయితే సంక్రాంతి పండగ నాడు మాత్రం కలెక్షన్స్ పర్లేదనే టాక్ వినిపిస్తోంది. 41వ రోజైన మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో రూ.30 లక్షలు రాగా.. హిందీలో 1.32 కోట్లు, తమిళ్, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2 లక్షల చొప్పున మొత్తంగా రూ.1.70 కోట్లను అందుకుంది పుష్ప 2. దీనిని బట్టి చూస్తే అల్లు అర్జున్ మూవీకి బిజినెస్ ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X