Pushpa 2 Day 42 collection : దెబ్బేసిన కనుమ .. షాకిచ్చేలా పుష్ప 2 వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ఇక ముగిసింది అనుకుంటున్న టైంలో సంక్రాంతి నాడు కుమ్మేశాడు అల్లు అర్జున్. బరిలో సంక్రాంతి సినిమాలు ఉన్నప్పటికీ బన్నీ తన సత్తా చాటాడు. గత కొద్దిరోజులుగా కలెక్షన్స్ పడిపోతుండగా.. పండగ పూట మాత్రం అల్లు అర్జున్ తన హవా చూపించాడు. ఈ నేపథ్యంలో కనుమ నాడు పుష్ప 2 ది రూల్ ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మూడేళ్ల క్రితం దేశాన్ని ఊపేసిన పుష్ప ది రైజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోని పాటలు, ఫైట్స్, అల్లు అర్జున్ మేనరిజంను చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా అనుకరించారు. ఎలాంటి ప్రమోషన్స్ జరపనప్పటికీ నార్త్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది పుష్ప . ఈ క్రేజ్ దృష్ట్యా పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, అల్లు అర్జున్ - రష్మికల గెటప్‌లతో పుష్ప 2 ది రూల్‌పై బజ్ నెలకొంది.
ఈ హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన ఘనతను అందుకుంది. దీంతో రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లను పుష్ప 2కి బ్రేక్ ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
కొండంత లక్ష్యంతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 .. ఓపెనింగ్ డేనే హిట్టు కొట్టింది. ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్ వైపు యావత్ దేశం చూసేలా చేసింది. ఇక అదే జోరును కంటిన్యూ చేస్తూ తొలి వారంలో రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు సాధించింది పుష్ప 2.

32 రోజుల పాటు థియేటర్‌లలో తన హవా చూపించిన పుష్ప 2 .. గత 10 రోజుల నుంచి డల్ అయ్యింది. దీనికి సంక్రాంతి సినిమాలు తోడు కావడంతో అల్లు అర్జున్ మూవీ కలెక్షన్స్ ఊసూరుమనిపించాయి. అయితే అనూహ్యంగా సంక్రాంతికి పుంజుకున్నాడు పుష్ప రాజ్. కానీ కనుమ నాటికి మళ్లీ మామూలే అన్నట్లు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. 42వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.12 లక్షలు , హిందీలో రూ.91 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో + ఓవర్సీస్‌లో రూ. 8 లక్షలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.1.13 కోట్ల వసూళ్లు వచ్చాయి. బుధవారంతో సంక్రాంతి సీజన్ ముగియడంతో పుష్ప 2 బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











