Pushpa 2 Day 43 collection : దారుణంగా పుష్ప 2 వసూళ్లు .. కోట్ల నుంచి లక్షల్లోకి, ఎంతంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 విజయవంతంగా 6 వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హిందీలో తప్పించి మిగిలిన అన్ని ఏరియాల్లోనూ పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ బిజినెస్ ముగిసింది. ఈ వారంతో నార్త్‌లోనూ బిజినెస్ క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి 43వ రోజు అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఆల్రెడీ దేశ ప్రజల్లో పుష్ప ది రైజ్ వేసిన ముద్రతో ఈ ప్రాంచైజీకి ఎక్కడా లేని బ్రాండ్ వచ్చేసింది. దీనిని ఎక్కడా తగ్గకుండా చిత్ర యూనిట్ చేసిన ప్రచార కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. జాతరలో అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ లుక్, పాటలు, టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్ . దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లుగా ఆడియన్స్ ఎదురుచూశారు.
ఈ హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన ఘనతను అందుకుంది. దీంతో రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లను పుష్ప 2కి బ్రేక్ ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
కొండంత లక్ష్యంతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 .. ఓపెనింగ్ డేనే హిట్టు కొట్టింది. ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి టాలీవుడ్ వైపు యావత్ దేశం చూసేలా చేసింది. విశ్లేషకుల అంచనాలు నిజం చేస్తూ తొలి వారంలో రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు సాధించింది పుష్ప 2.

జనవరి 15తో పుష్ప 2 ది రూల్ ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు దాదాపు రూ.836 కోట్ల షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.215 కోట్ల లాభాలను అందించింది. ఇక 43వ రోజు నాటి వసూళ్ల విషయానికి వస్తే .. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 లక్షలు, హిందీలో రూ.71 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో రూ. 4 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.2 లక్షల చొప్పున మొత్తంగా రూ. 90 లక్షల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. పరిస్థితి చూస్తుంటే ఈ వీకెండ్‌తో పుష్ప 2 థియేట్రికల్ బిజినెస్ క్లోజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











