Pushpa 2 Day 44 collection : 20 నిమిషాలు ప్లాన్ ఫెయిల్ .. షాకిచ్చేలా వసూళ్లు, ఎన్ని కోట్లంటే?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 విజయవంతంగా 6 వారాలు పూర్తి చేసుకుని అర్ధ శతదినోత్సవం దిశగా పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాలు, ఇతర ఏరియాల్లో థియేట్రికల్ రన్ ముగిసినా హిందీ ఇంకా ఆదుకుంటూనే ఉంది. ఇలాంటి దశలో సర్‌ప్రైజ్ పేరిట శుక్రవారం నుంచి పుష్ప 2 రిలోడెడ్ వెర్షన్‌ అంటూ ఓ 20 నిమిషాలు అదనపు ఫుటేజ్‌ను తీసుకొచ్చారు. మరి ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? 44వ రోజు అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 44 Collections report

అల్లు అర్జున్ లుక్, పాటలు, టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్ . పాట్నాలోని ప్రఖ్యాత గాంధీ మైదాన్‌లో జరిగిన ఈవెంట్‌కు నార్త్ ఆడియన్స్ పోటెత్తారు. ఈ కార్యక్రమం పుష్ప 2పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో క్లియర్‌గా అర్ధమైపోయాయి. ఈ హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.

దీంతో రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లను పుష్ప 2కి బ్రేక్ ఈవెన్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. భారీ బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2 .. ఓపెనింగ్ డేనే షాకిచ్చింది. ఏకంగా రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలనే విస్మయపరిచింది. అప్పుడు మొదలైన అల్లు అర్జున్ ఊచకోత దాదాపు నెల రోజుల పాటు ఎదురు లేకుండా సాగింది. ఫస్ట్‌ వీక్‌లోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు సాధించింది పుష్ప 2.

Pushpa 2 The Rule Box Office Day 44 Collections report

ఇప్పటి వరకు దాదాపు రూ.836 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.215 కోట్ల లాభాలను అందించింది. ఇక 44వ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. నిడివి పెరగడంతో కట్ చేసిన దాదాపు 20 నిమిషాల ఫుటేజ్‌ను జనవరి 17 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. అయితే ఈ సీన్లు ఏవి? ఏ ప్లేస్‌లో యాడ్ చేశారు అనేది తెలుసుకోవాలని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు.

44వ రోజు పుష్ప 2 కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తెలుగులో ఆల్రెడీ బిజినెస్ క్లోజ్ అయినట్లుగా వార్తలు వస్తుండగా.. ఇన్ని రోజులుగా పరువు కాపాడుతూ వస్తున్న హిందీ బెల్ట్ కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రూ.36 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది పుష్ప 2. అయితే వీకెండ్ కావడం, 20 నిమిషాల ఫుటేజ్ అందుబాటులోకి రావడంతో ఈ రెండ్రోజుల్లో అల్లు అర్జున్ ఏమైనా మేజిక్ చేస్తాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X