Pushpa 2 Day 45 collection : మళ్లీ పుష్పగాడి ఊచకోత మొదలు .. అల్లు అర్జున్‌ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 అర్ధ శతదినోత్సవం దిశగా పరుగులు తీస్తోంది. జనవరి 17 నుంచి రీలోడెడ్ వెర్షన్‌ అంటూ ఓ 20 నిమిషాలు అదనపు ఫుటేజ్‌ను తీసుకురావడంతో ప్రస్తుతం ప్రేక్షకులు ఆ సీన్ల గురించి చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ అదే డిస్కషన్స్.. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అయ్యింది? 45వ రోజు అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 45 Collections report

అల్లు అర్జున్ లుక్, పాటలు, టీజర్, ట్రైలర్‌లతో పాటు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్ . ఈ హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త బెంచ్ మార్క్‌లు క్రియేట్ చేసింది.

రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైంది పుష్ప 2 . ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొడుతుందని థియేటర్‌లో రిలీజయ్యే సమయంలో విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా రూ. 294 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. అలా ఫస్ట్‌ వీక్‌లోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2.

కల్కి 2898 ఏడీ, స్త్రీ 2, కేజీఎఫ్ 2, పఠాన్, జవాన్ వంటి సినిమాల రికార్డులను బద్ధలుకొట్టిన పుష్ప 2 ఈ క్రమంలో బాహుబలి 2ని కూడా అధిగమించింది. తద్వారా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో .. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా, అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది. ఇక రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.

Pushpa 2 The Rule Box Office Day 45 Collections report

ఇప్పటి వరకు దాదాపు రూ.840 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.220 కోట్లకుపైగా లాభాలను అందించింది. నెల రోజుల పాటు ఎదురులేకుండా సాగిన అల్లు అర్జున్ మూవీకి సంక్రాంతి టైంలో ఊహించని పోటీ ఎదురైంది. దీనిని తట్టుకునేందుకు గాను పుష్ప 2లో కట్ చేసిన 20 నిమిషాల ఫుటేజీని తిరిగి యాడ్ చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీని ప్రభావం బాగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

45వ రోజైన శనివారం ప్రపంచవ్యాప్తంగా రూ.1.12 కోట్లు రాబట్టింది పుష్ప 2. అయితే వీకెండ్ కావడం, 20 నిమిషాల ఫుటేజ్‌పై మౌత్ టాక్ బాగానే ఉండటంతో మరికొన్ని రోజులు అల్లు అర్జున్ స్టడీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X