Pushpa 2 Day 46 collection : అల్లు అర్జున్ మాస్ జాతర .. పుష్ప 2కి కనకవర్షం, ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్- ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ వడివడిగా 50 రోజుల వేడుకకి దగ్గరైంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ రికార్డులపై కన్నేసిన అల్లు అర్జున్ .. దానిని కొట్టేందుకు పరుగులు తీస్తున్నాడు. జనవరి 17 నుంచి రీలోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేయడం కొన్ని ఏరియాలలో రిజల్ట్ చూపిస్తోంది. ఈ నేపథ్యంలో 46వ రోజు అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త బెంచ్ మార్క్‌లు క్రియేట్ చేసింది. రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైంది పుష్ప 2 . అందరి అంచనాలను నిజం చేస్తూ తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. అలా ఫస్ట్ వీక్‌లోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2.
46 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.220 కోట్లకుపైగా లాభాలను అందించింది. దీనిని మరింత పెంచేందుకు గాను పుష్ప 2లో 20 నిమిషాల ఫుటేజీని కలిపి ఓ ప్రయోగం చేసింది మైత్రీ మూవీ మేకర్స్ . కొన్ని ఏరియాలలో దీని ప్రభావం బాగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏమేం సీన్లు కలిపారు? ఎక్కడ కలిపారు? వంటి వివరాలను ఆల్రెడీ బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో వాటిపై కొంత హైప్ కనిపిస్తోంది.

ఇకపోతే 46వ రోజైన ఆదివారం ప్రపంచవ్యాప్తంగా రూ.1.63 కోట్ల గ్రాస్ రాబట్టింది పుష్ప 2. ఇందులో రూ.1.36 కోట్ల వరకు హిందీ బెల్ట్ నుంచి వచ్చిందో కావడం విశేషం. అయితే వీకెండ్ , సంక్రాంతి సెలవులు ముగియడంతో ఇకపై ఈ సినిమా ప్రభావం ఎలా ఉండబోతుందో? దంగల్ రికార్డును అల్లు అర్జున్ బద్ధలుకొడతాడో? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











