Pushpa 2 Day 47 collection : షాకిచ్చేలా పుష్ప 2 వసూళ్లు .. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని కోట్లంటే?
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ అర్ధ శత దినోత్సవానికి దగ్గరైంది. ఒక్కో బ్లాక్‌బస్టర్ మూవీ రికార్డును బద్ధలుకొడుతూ ఇప్పుడు ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే రూ. 1850 కోట్లకు పైగా వసూళ్లతో అమీర్‌ఖాన్ సినిమా రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో 47వ రోజు అల్లు అర్జున్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాపై నెలకొన్న అంచనాల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఎన్ని అవాంతరాలను దాటుకుని గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైంది పుష్ప 2 . అందరి అంచనాలను నిజం చేస్తూ తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. అలా ఫస్ట్ వీక్‌లోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2.
46 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.220 కోట్లకుపైగా లాభాలను అందించి స్లో అండ్ స్టడీగా వసూళ్లు రాబడుతోంది. ఇటీవల సంక్రాంతి కానుకగా పుష్ప 2లో 20 నిమిషాల ఫుటేజీతో రీలోడెడ్ వెర్షన్ పేరిట రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ . కొన్ని ఏరియాలలో దీని ప్రభావం బాగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీ ఆడియన్స్‌కి ఈ 20 నిమిషాల ఫుటేజ్ బాగానే ఎక్కినట్లుగా వసూళ్లను బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పుష్ప 2 థియేట్రికల్ రన్ ఇక ముగిసినట్లేనని అంతా అనుకుంటున్న దశలో అల్లు అర్జున్ మరోసారి జూలు విదిల్చాడు. గత వీకెండ్ నుంచి పుష్ప 2 రోజుకు కోటిన్నరకు తగ్గకుండా కలెక్షన్లు రాబట్టింది. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా వసూళ్లు పుంజుకుని రూ.32 లక్షలు రాబట్టగా , హిందీలో (17 లక్షలు) తగ్గాయి. మొత్తంగా 47వ రోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ది రూల్ సినిమాకు రూ. 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ , సంక్రాంతి సెలవులు ముగియడంతో ఈ వారం అల్లు అర్జున్ ఎలాంటి మేజిక్ చేస్తాడోనని ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











