Pushpa 2 Day 49 collection : 20 నిమిషాల ఎఫెక్ట్.. షాకిచ్చేలా పుష్ప 2 వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ వసూళ్లతోనే కాదు.. వివాదాలతోనూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా పుష్ప 2 నిర్మాతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడంతో మరోసారి చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఇలాంటి పరిస్ధితుల్లో 49వ రోజు అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

అంచనాలకు తగ్గట్లుగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోనే కొత్త చరిత్ర సృష్టించింది పుష్ప 2. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకొచ్చి నేటికీ దుమ్మురేపుతోంది పుష్ప 2 . తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2.
ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.220 కోట్లకుపైగా లాభాలను అందించింది. 48 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ. 104.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 35.59 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 25.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10.32 కోట్లు, గుంటూరులో రూ. 16.06 కోట్లు, కృష్ణాలో రూ. 13.16 కోట్లు, నెల్లూరులో రూ.8.18 కోట్లు, కర్ణాటకలో రూ. 53.35 కోట్లు, తమిళనాడులో రూ.34.85 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 387.44 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 127.20 కోట్లు చొప్పున వసూళ్లు వచ్చాయి.

సంక్రాంతి కానుకగా ఇటీవల 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను రీలోడెడ్ వెర్షన్ పేరుతో చిత్ర నిర్మాతలు అందుబాటులోకి తీసుకురావడం కొన్ని ఏరియాలలో సత్ఫలితాలను తీసుకొచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజాగా 49వ రోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమాకు రూ. 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. గురువారంతో ఈ సినిమా విడుదలై 50 రోజులు కావొస్తుండటంతో చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి పుష్ప 2 థియేట్రికల్ రన్ ఇంకెంత కాలం కొనసాగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











