Pushpa 2 Day 50 collection : 50 రోజులు.. ఆగని వసూళ్ల ఊచకోత, లైఫ్ టైం రికార్డ్ కొట్టిన అల్లు అర్జున్
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ సంచలనాలు నమోదు చేస్తూ అర్ధ శత దినోత్సవాన్ని జరుపుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా జనవరి 23తో 50 రోజులు పూర్తి చేసుకుంది. రిలీజైన నాటి నుంచి నేటి వరకు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మరి 50వ రోజు పుష్ప 2 ది రూల్ ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాపై తొలి నుంచి ఉన్న హైప్ దృష్ట్యా పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త బెంచ్ మార్క్‌లు సెట్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఎన్నో అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 ఇప్పటికీ థియేటర్లలో దుమ్మురేపుతోంది . తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది.
ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.220 కోట్లకుపైగా లాభాలను అందించింది. 49 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ. 104.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 35.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 25.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10.32 కోట్లు, గుంటూరులో రూ. 16.06 కోట్లు, కృష్ణాలో రూ. 13.16 కోట్లు, నెల్లూరులో రూ.8.18 కోట్లు, కర్ణాటకలో రూ. 53.35 కోట్లు, తమిళనాడులో రూ.34.85 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 387.56 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 127.22 కోట్లు చొప్పున వసూళ్లు రాబట్టింది.

సంక్రాంతి కానుకగా ఇటీవల 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను రీలోడెడ్ వెర్షన్ పేరుతో చిత్ర నిర్మాతలు అందుబాటులోకి తీసుకురావడం కొన్ని ఏరియాలలో సత్ఫలితాలను తీసుకొచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వర్కింగ్ డేస్ అయినప్పటికీ సోమ, మంగళవారాల్లో వరుసుగా రూ.65 లక్షలకు పైగా గ్రాస్ రాబట్టిన పుష్ప 2.. బుధవారం నాడు రూ.50 లక్షలు వసూలు చేసింది. బేబీ జాన్, గేమ్ ఛేంజర్, ఆజాద్ , ఎమర్జెన్సీ వంటి భారీ చిత్రాలు విడుదలైనా హిందీ బెల్ట్‌లో పుష్ప రాజ్ తన హవా చూపిస్తున్నాడు. 50వ రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 42 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చింది. శుక్రవారం నుంచి వీకెండ్ మొదలు కానుండటంతో పుష్ప 2 ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











