Pushpa 2 Day 51 collection : టఫ్ ఫైట్‌లోనూ కలెక్షన్ల వర్షం.. పుష్ప 2కి ఎన్ని కోట్లంటే?
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ అర్ధ శత దినోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. శత దినోత్సవాలు, అర్ధ శత దినోత్సవాలు కనుమరుగు అవుతున్న సమయంలో ఒక సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇలాంటి రేర్ ఫీట్‌ను అల్లు అర్జున్ అందుకున్నారు. 50 రోజుల వరకు వసూళ్ల వర్షం కురిపించిన పుష్ప 2 .. 51వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా పుష్ప 2 ది రూల్ సినిమాపై టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్‌ల్లా అమ్ముడయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త లెక్కలు సెట్ చేసింది.
రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ టార్గెట్‌గా గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 .. 51 రోజులు గడుస్తున్నా థియేటర్లలో నేటీకి దుమ్మురేపుతోంది . తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో తన విధ్వంసం ఎలా ఉండబోతుందన్న దానిపై ఓ ట్రైలర్ చూపించాడు. ఆ తర్వాత తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది .
ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.220 కోట్లకుపైగా లాభాలను అందించింది. 50 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ. 104.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 35.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 25.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10.32 కోట్లు, గుంటూరులో రూ. 16.06 కోట్లు, కృష్ణాలో రూ. 13.16 కోట్లు, నెల్లూరులో రూ.8.18 కోట్లు, కర్ణాటకలో రూ. 53.37 కోట్లు, తమిళనాడులో రూ.34.86 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 387.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 127.24 కోట్లు చొప్పున వసూళ్లు రాబట్టింది.
ఇటీవల అందుబాటులోకి వచ్చిన 20 నిమిషాల రీలోడెడ్ వెర్షన్‌కు నార్త్ బెల్ట్‌లో ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. బేబీ జాన్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ , ఆజాద్ , ఎమర్జెన్సీ వంటి భారీ చిత్రాలు విడుదలైనా పుష్ప రాజ్ ఇంకా తన హవా చూపిస్తున్నాడు. 51వ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.32 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టాడు అల్లు అర్జున్. వీకెండ్ నేపథ్యంలో శని, ఆదివారాల్లో వసూళ్లు అదిరిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం అల్లు అర్జున్ ఏ రేంజ్‌లో తన ప్రభంజనం చూపిస్తాడో.


Click it and Unblock the Notifications











