Pushpa 2 Day 52 collection : దారుణంగా పడిపోయిన వసూళ్లు.. పుష్ప 2కి ఎన్ని కోట్లంటే?
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ 50 రోజులు దాటినా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. 20 నిమిషాల ఫుటేజ్‌ను అదనంగా కలపడం కొన్ని ఏరియాల్లో సత్ఫలితాలను ఇచ్చింది. 8వ వారంలోకి అడుగుపెట్టిన పుష్ప 2 బిజినెస్ అయిపోయిందన్న దశలో వీర విహారం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో 52వ రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చాయో చూస్తే.
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా పుష్ప 2 ది రూల్‌పై భారీ హైప్ నెలకొంది. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త లెక్కలు సెట్ చేసింది ఈ సినిమా.
రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ టార్గెట్‌గా గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి తన విధ్వంసాన్ని ఘనంగా ప్రారంభించింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది.

ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను పంచిపెట్టింది. 51 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ. 104.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 35.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 25.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10.32 కోట్లు, గుంటూరులో రూ. 16.06 కోట్లు, కృష్ణాలో రూ. 13.16 కోట్లు, నెల్లూరులో రూ.8.18 కోట్లు, కర్ణాటకలో రూ. 53.38 కోట్లు, తమిళనాడులో రూ.34.86 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 387.88 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 127.24 కోట్లు చొప్పున వసూళ్లు రాబట్టింది.
నెల రోజుల వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఒక్కో సినిమా రికార్డును బద్ధలుకొడుతూ వచ్చిన పుష్ప 2కు సంక్రాంతి సీజన్ షాకిచ్చింది. తెలుగులో మెజారిటీ థియేటర్లను కోల్పోవడంతో వసూళ్లపై దెబ్బపడింది. అయినప్పటికీ హిందీ ఆడియన్స్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకోవడంతో రోజుకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి తగ్గకుండా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత హిందీ సినిమాలైన
బేబీ జాన్, ఆజాద్ , ఎమర్జెన్సీ వంటి భారీ చిత్రాలు విడుదలైనా పుష్ప 2 హవా కొనసాగుతూనే ఉంది. ఇక 52వ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.30 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టాడు అల్లు అర్జున్. వీకెండ్ నేపథ్యంలో ఆదివారం బుకింగ్స్ బాగుండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











