Pushpa 2 Day 53 collection : కంగన, అక్షయ్‌లతో టఫ్ ఫైట్ .. కుమ్మేసిన అల్లు అర్జున్, ఎన్ని కోట్లంటే?

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ బిజినెస్‌కి ఎండ్ కార్డ్ పడుతుందంటూ పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ వాటిని బ్రేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు అల్లు అర్జున్ . ఈ వీకెండ్‌లో పుష్ప 2 సినిమాకు సాలీడ్ కలెక్షన్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఏ ఏరియాలో అల్లు అర్జున్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసాడో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 53 Collections report

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా పుష్ప 2 ది రూల్‌పై భారీ హైప్ నెలకొంది. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త లెక్కలు సెట్ చేశాడు అల్లు అర్జున్. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులను ఏ సినిమా బ్రేక్ చేస్తుందంటూ ఇప్పటికే చర్చ జరుగుతోంది.

రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ లక్ష్యంగా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్లలో విడుదలైంది పుష్ప 2. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టి మున్ముందు తన ఊచకోత ఎలా ఉండబోతోంది అన్న దానిపై హింట్ ఇచ్చాడు అల్లు అర్జున్. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది .

ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను పంచిపెట్టింది. 52 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ. 104.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 35.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 25.03 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10.32 కోట్లు, గుంటూరులో రూ. 16.07 కోట్లు, కృష్ణాలో రూ. 13.16 కోట్లు, నెల్లూరులో రూ.8.18 కోట్లు, కర్ణాటకలో రూ. 53.39 కోట్లు, తమిళనాడులో రూ.34.86 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 388.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 127.25 కోట్లు చొప్పున వసూళ్లు రాబట్టింది.

50 రోజుల మార్క్ చేరుకున్నా.. కొత్త సినిమాల నుంచి పోటీ ఎదురవుతున్నా పుష్ప 2 ఇప్పటికీ తన హవా చూపిస్తూనే ఉంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో సినిమాకు ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇటీవల సంక్రాంతి కానుకగా అదనంగా చేర్చిన 20 నిమిషాల రీలోడెడ్ వెర్షన్ కూడా నార్త్ ఆడియన్స్‌కి బాగా ఎక్కింది. ఇప్పటికీ అల్లు అర్జున్ సినిమాకు రోజుకు రూ.30 లక్షలు తగ్గకుండా వసూళ్లు వస్తున్నాయంటే నార్త్ ఆడియన్స్ వల్లే. తాజాగా పుష్ప 2 .. 53వ రోజు కలెక్షన్లను ఇరగదీసింది. దాదాపు వారం రోజుల తర్వాత రూ. కోటికి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి నేటికీ తన సత్తా తగ్గలేదని నిరూపించాడు అల్లు అర్జున్. మరి లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎన్ని కోట్ల వద్ద ఆగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X