Pushpa 2 Day 55 collection : చేతులెత్తేసిన అల్లు అర్జున్ .. షాకిచ్చేలా పుష్ప 2 వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ఇటీవలే 50 రోజుల పండుగను జరుపుకున్న సంగతి తెలిసిందే. మరో రెండ్రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. అయినప్పటికీ నార్త్ నుంచి సౌత్ వరకు పుష్ప 2కి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పటికీ ప్రతిరోజు రూ. 25 లక్షల షేర్ తగ్గకుండా వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో 55వ రోజు పుష్ప 2 ఎంత వసూలు చేసిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా పుష్ప 2 ది రూల్‌పై భారీ హైప్ నెలకొంది. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త రికార్డులు సెట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ సాధిస్తేనే ఈ సినిమా లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
భారీ లక్ష్యంతో గతేడాది డిసెంబర్ 5న బరిలోకి దిగిన పుష్ప 2.. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2. ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది.
53 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ. 104.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 35.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 25.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10.32 కోట్లు, గుంటూరులో రూ. 16.08 కోట్లు, కృష్ణాలో రూ. 13.16 కోట్లు, నెల్లూరులో రూ.8.18 కోట్లు, కర్ణాటకలో రూ. 53.40 కోట్లు, తమిళనాడులో రూ.34.86 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 388.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 127.26 కోట్లు చొప్పున వసూళ్లు రాబట్టింది.
కేరళ, తమిళనాడులలో థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్ప 2కి భారీ నష్టాలే వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాలు, హిందీలోనూ ఈ సినిమా థియేట్రికల్ రన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక 55వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. గత వీకెండ్‌లో దుమ్మురేపిన అల్లు అర్జున్ వర్కింగ్ డేస్‌లో తడబడుతున్నాడు. దీనికి తోడు ఎమర్జెన్సీ, స్కై ఫోర్స్ వంటి సినిమాలు పుష్ప 2కి గట్టి పోటీ ఇస్తున్నాయి. 55వ రోజైన మంగళవారం ప్రపంచవ్యాప్తంగా రూ.23 లక్షలు మాత్రమే రాబట్టింది అల్లు అర్జున్ మూవీ. త్వరలో ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండటంతో పుష్ప 2 ఏ మేరకు వసూళ్లు రాబడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











