Pushpa 2 Day 56 collection : దారుణంగా పడిపోయిన వసూళ్లు .. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని కోట్లంటే?
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప 2 .. మరో 48 గంటల్లో ఓటీటీ రిలీజ్ కానుంది. అయినప్పటికీ అల్లు అర్జున్ సినిమాకు వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 56వ రోజు పుష్ప 2కి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా పుష్ప 2 ది రూల్‌పై భారీ హైప్ నెలకొంది. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరోకూ, ఏ సినిమాకూ సాధ్యం కానీ విధంగా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు విశ్లేషకులు.
గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్లలో రిలీజైన పుష్ప 2.. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2. ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది.
55 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ. 104.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 35.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 25.06 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10.32 కోట్లు, గుంటూరులో రూ. 16.08 కోట్లు, కృష్ణాలో రూ. 13.16 కోట్లు, నెల్లూరులో రూ.8.18 కోట్లు, కర్ణాటకలో రూ. 53.41 కోట్లు, తమిళనాడులో రూ.34.86 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 388.42 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 127.27 కోట్లు చొప్పున వసూళ్లు రాబట్టింది.
కేరళ, తమిళనాడులలో థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్ప 2కి భారీ నష్టాలే వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే హిందీలో వచ్చిన లాభాలతో ఈ లాస్ కవర్ చేసుకుంటున్నారు మేకర్స్. త్వరలోనే తెలుగు రాష్ట్రాలు, హిందీలోనూ పుష్ప 2 థియేట్రికల్ రన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక 56వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.25 లక్షలు మాత్రమే రాబట్టింది అల్లు అర్జున్ మూవీ. మరికొద్దిగంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటంతో పుష్ప 2 ఏ మేరకు వసూళ్లు రాబడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











