Pushpa 2 Day 57 collection : వసూళ్లలో అల్లు అర్జున్ మాస్ హిస్టరీ .. పుష్ప 2కి ఎన్ని కోట్లంటే?

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ - ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్‌ థియేట్రికల్ రన్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇటీవలే అర్ధ శత దినోత్సవం జరుపుకుంది. జనవరి 30 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చినప్పటికీ అల్లు అర్జున్ సినిమాకు వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 57వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Pushpa 2 The Rule Box Office Day 57 Collections report

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో పుష్ప 2 ది రూల్‌పై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాట్నాలోని ప్రఖ్యాత గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ఈవెంట్ కూడా సినిమాపై హైప్ పెరగడానికి కారణమైంది. ఈ పరిణామాలతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త బెంచ్ మార్క్‌ సెట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో పుష్ప 2కి రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్‌‌ కలెక్షన్స్‌ని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు విశ్లేషకులు.

గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్లలో రిలీజైన పుష్ప 2.. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2. ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది.

ఇటీవలే కేరళ, తమిళనాడులలో థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్ప 2కి భారీ నష్టాలే వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే హిందీలో వచ్చిన లాభాలతో ఈ లాస్ కవర్ చేసుకుంటున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన నైజాం ఏరియాలో జరిగిన బిజినెస్ గురించి ఇప్పుడిప్పుడే లెక్కలు బయటికొస్తున్నాయి. పుష్ప 2కి ఈ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. లాంగ్‌రన్‌లో రూ. 104.7 కోట్లు రాబట్టి కేవలం రూ.5 కోట్ల లాభాలను పంచింది. మార్జిన్ తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, 100 కోట్లను రికవరీ చేయడమంటే మామూలు విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. ఆర్ఆర్ఆర్ తర్వాత నైజాం ఏరియాలో రూ.100 కోట్ల షేర్‌ను దాటిన సినిమాగా పుష్ప 2 ది రూల్ నిలిచింది.

త్వరలోనే తెలుగు రాష్ట్రాలు, హిందీలోనూ పుష్ప 2 థియేట్రికల్ రన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక 57వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.20 లక్షలు మాత్రమే రాబట్టింది అల్లు అర్జున్ మూవీ. ఆల్రేడీ ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో పుష్ప 2 ఏ మేరకు వసూళ్లు రాబడతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X