Pushpa 2 Day 58 collection : దెబ్బేసిన ఓటీటీ .. షాకిచ్చేలా పుష్ప 2 వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 2 ది రూల్ .. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కనివినీ ఎరుగని వసూళ్లతో, భారీ బ్లాక్ బస్టర్ల రికార్డులను బద్ధలు కొడుతూ దూసుకెళ్లింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్ 5లో నిలిచింది. 50 రోజులను పూర్తి చేసుకున్న పుష్ప 2 ఇప్పటికీ తన ప్రభంజనం చూపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 58వ రోజు అల్లు అర్జున్ చిత్రం ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో పుష్ప 2 ది రూల్‌పై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో పుష్ప 2 లాభాల్లోకి రావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
గతేడాది డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్‌లో గ్రాండ్‌గా రిలీజైన పుష్ప 2.. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2. ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ అందుకున్న పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను పంచి పెట్టింది.
ఇంతటి ఘన విజయాన్ని అందుకున్నా, భారీ వసూళ్లు నమోదవుతున్నా కొన్ని ఏరియాలలో మాత్రం పుష్ప 2కి నష్టాలు రావడం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవలే కేరళ, తమిళనాడులలో థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ నష్టాలను మూటకట్టుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే హిందీలో వచ్చిన లాభాలతో ఈ లాస్ కవర్ చేసుకుంటున్నారు మేకర్స్. నిజానికి జనవరి రెండో వారం నాటికి పుష్ప 2 థియేట్రికల్ రన్ పూర్తి కావాల్సి ఉంది. అయితే అప్పుడు రీలోడెడ్ వర్షన్ పేరుతో 20 నిమిషాల ఫుటేజ్‌ను మేకర్స్ జోడించడంతో మరోసారి వసూళ్ల వర్షం కురుస్తోంది.
తాజాగా పుష్ప 2 మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి రావడంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాలు, హిందీలోనూ పుష్ప 2 థియేట్రికల్ రన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక 58వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.10 లక్షలు మాత్రమే రాబట్టింది అల్లు అర్జున్ మూవీ. ఆల్రేడీ ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడంతో పుష్ప 2 ఏ మేరకు వసూళ్లు రాబడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











