Pushpa 2 Day 59 collection : ఓటీటీ దెబ్బ గట్టిగానే .. పాతాళానికి పడిపోయిన పుష్ప 2 వసూళ్లు
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ 50 రోజులకు పైగా థియేటర్‌లో నడిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో మేకర్స్ కూడా పుష్ప 2 థియేట్రికల్ రన్ కొనసాగేలా, ప్రేక్షకులు వచ్చేలా చేశారు. ఇక జనవరి 30 నుంచి ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటంతో పుష్ప 2కి థియేటర్‌లలో ఎండ్ కార్డ్ పడినట్లేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 59వ రోజు అల్లు అర్జున్ చిత్రానికి ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో పుష్ప 2 ది రూల్‌పై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో పుష్ప 2కి రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు
భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 5న 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప 2.. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2. ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ అందుకున్న పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను పంచి పెట్టింది.

భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్ 5లో నిలిచినప్పటికీ పుష్ప 2కి కొన్ని ఏరియాలలో నష్టాలు రావడం పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ప్రధానంగా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భారీ నష్టాలు వచ్చాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే హిందీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ లాభాలను కళ్ల జూశారు. గత నెలలో రీలోడెడ్ వెర్షన్ పేరుతో 20 నిమిషాల ఫుటేజ్‌ను అదనంగా చేర్చడం పుష్ప 2కి ప్లస్ అయ్యింది.
ఇక సస్పెన్స్‌కు తెరదించుతూ పుష్ప 2 మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో వచ్చినప్పటికీ అల్లు అర్జున్ నార్త్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇక 59వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.10 లక్షలు మాత్రమే రాబట్టింది అల్లు అర్జున్ మూవీ. ఓటీటీలోకి వచ్చేయడంతో పుష్ప 2 పరుగు ఎక్కడ ఆగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











