Pushpa 2 Day 6 collection : స్త్రీ 2 ఔట్ .. 1000 కోట్లకు అడుగుదూరంలో పుష్ప, 6వ రోజు ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రీసెంట్‌గా వచ్చిన పుష్ప 2 నార్త్ , సౌత్ అన్న తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజుల వ్యవధిలోనే రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తొలి వారంలోనే రూ.1000 కోట్లను కొట్టేయాలని అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే చాలా ఏరియాలలో బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ రికార్డులను బద్ధలు కొట్టింది పుష్ప 2 కన్ను ఇప్పుడు ప్రభాస్ రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీపై పడింది.

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. టీజర్ , ట్రైలర్, అల్లు అర్జున్ గెటప్స్‌తో భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారం చేసింది పుష్ప 2.

Pushpa 2 The Rule Box Office Day 6 collections report

దీంతో ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్‌‌ టార్గెట్‌ను నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11000 థియేటర్లలో డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 ది రూల్ రికార్డు స్థాయిలో తొలి రోజు రూ. 294 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్‌ను రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. తెలుగు, హిందీ, ఓవర్సీస్‌లో ప్రభంజనం సృష్టించడంతో చూస్తుండగానే ఐదు రోజుల్లో రూ. 860 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది.

Pushpa 2 The Rule Box Office Day 6 collections report

ఆరో రోజు ఫస్ట్ షో నాటికే ఇండియన్ మూవీస్ పరంగా ఫాస్ట్‌గా రూ. 900 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డుల్లోకెక్కింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ సాధించిన రికార్డును పుష్ప బద్ధలుకొట్టింది. కల్కి హిందీలో సాధించిన కలెక్షన్స్‌ను అల్లు అర్జున్ బ్రేక్ చేశాడు. కల్కి 5 రోజుల్లో రూ. 294 కోట్లు వసూలు చేయగా .. పుష్ప 2 దానిని క్రాస్ చేయడమే కాదు 5 రోజుల్లో ఏకంగా రూ. 340 కోట్లను అందుకుని చరిత్ర సృష్టించింది.

అలాగే ఈ ఏడాది సంచలన విజయం అందుకున్న శ్రద్ధా కపూర్ మూవీ స్త్రీ2 వసూళ్లను కూడా పుష్ప బ్రేక్ చేసింది. స్త్రీ2 టోటల్ రన్‌లో రూ. 870 కోట్ల గ్రాస్‌ను 60 రోజుల్లో సాధించగా.. దానిని పుష్ప 2 కేవలం ఐదు రోజుల్లోనే కొట్టిపడేసింది. అల్లు అర్జున్ మూవీ నెక్ట్స్ టార్గెట్ కల్కినే . ప్రభాస్ మూవీ లాంగ్ రన్‌లో రూ. 1100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా.. ఇవాళ లేదా రేపో దీనిని పుష్ప 2 బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్లు, హిందీలో రూ. 40 కోట్లు, తమిళనాడులో రూ.3 కోట్లు, కన్నడ, మలయాళం + రెస్టాఫ్ ఇండియాలలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు చొప్పున మొత్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆరు రోజుల వరకు పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా రూ.960 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఏడో రోజు నాటికే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X