Pushpa 2 Day 60 collection : చేతులెత్తేసిన పుష్పరాజ్ .. అల్లు అర్జున్ మూవీకి దారుణంగా వసూళ్లు
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ మరో అరుదైన ఘనతను అందుకుంది. ఏకంగా 60 రోజుల పాటు విజయవంతంగా ఈ సినిమా ప్రదర్శితమైంది. ప్రతిరోజూ ఒక్కో సినిమా రికార్డును అధిగమిస్తూ తన పేరిట కొత్త లెక్కలు నమోదు చేశారు అల్లు అర్జున్. ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చినా ఈ సినిమా తన మేనియా చూపిస్తూనే ఉంది . ఈ నేపథ్యంలో 60వ రోజు పుష్ప 2 ది రూల్ ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో పుష్ప 2 ది రూల్‌పై తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు అల్లు అర్జున్. దీంతో పుష్ప 2 లాభాల్లోకి రావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు
గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11 వేల థియేటర్‌లలో రిలీజై మరో రికార్డు అందుకుంది పుష్ప 2.. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2. ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ అందుకున్న పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను పంచి పెట్టింది.
పఠాన్, జవాన్, కల్కి 2898 ఏడీ, స్త్రీ 2, కేజీఎఫ్ 2 , ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల కలెక్షన్ల రికార్డులను అధిగమిస్తూ దూసుకెళ్లాడు అల్లు అర్జున్ . తద్వారా భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్ 5లో నిలిచింది. ఇన్ని రికార్డులు సాధించినప్పటికీ పుష్ప 2కి కొన్ని ఏరియాలలో నష్టాలు రావడం విశ్లేషకులను షాక్‌కు గురిచేసింది. ప్రధానంగా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భారీ నష్టాలు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఈ జనవరి 30 నుంచి పుష్ప 2 .. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో వచ్చింది. అయినప్పటికీ హిందీ బెల్ట్ సహా కొన్ని ఏరియాలలో అల్లు అర్జున్ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇక 60వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.12 లక్షలు మాత్రమే రాబట్టింది పుష్ప 2. ఓటీటీలో స్ట్రీమింగ్ నేపథ్యంలో త్వరలోనే అల్లు అర్జున్ మూవీకి ఎండ్ కార్డ్ పడనుంది.


Click it and Unblock the Notifications











