Pushpa 2 Day 7 collection : 1000 కోట్లు కొట్టినా నో రిలాక్స్ .. అల్లు అర్జున్ కసి తీరేది ఎప్పుడంటే ?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప పార్ట్ 1కి సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన క్షణం నుంచి నార్త్ , సౌత్ అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, స్త్రీ 2 వంటి భారీ బ్లాక్ బస్టర్స్ రికార్డులను పుష్ప 2 ఆల్రెడీ బద్ధలు కొట్టేసింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ మామూలుగా జరగదని ట్రేడ్ పండితులు తొలి నుంచి చెబుతూనే ఉన్నారు. వారి అంచనాలు నిజం చేస్తూ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి.

దీంతో ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్ టార్గెట్‌ను నిర్దేశించారు ట్రేడ్ పండితులు. భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11000 థియేటర్లలో డిసెంబర్ 5న రిలీజైంది పుష్ప 2 ది రూల్. ఏకంగా రూ. 294 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. అదే ఊపును కంటిన్యూ చేస్తూ కేవలం వారం రోజుల్లోనే ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి దుమ్మురేపాడు అల్లు అర్జున్.
ఏడో రోజు పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో రూ. 11 కోట్లు, హిందీలో రూ. 33 కోట్లు, తమిళనాడులో రూ.3.5 కోట్లు, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలలో రూ. 4 కోట్లు , ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లు చొప్పున మొత్తంగా రూ.62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది . అంతేకాదు ఏడో రోజు నాటికి ఒక్క హిందీలోనే రూ.400 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని సాధించి అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న చిత్రంగా పుష్ప 2 నిలిచింది. తెలుగు కంటే పుష్ప2కి హిందీలోనే మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సినిమా ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించి రూ.1000 కోట్లను అందుకోవడం వెనుక హిందీదే మేజర్ షేర్.
ఈ జోష్‌ను ఇలాగే కంటిన్యూ చేస్తే రెండో వారానికే రూ.500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్‌ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యే నాటికి పుష్ప 2 రూ. 700 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని అందుకుంటుందని భావిస్తున్నారు. హిందీ మార్కెట్ అలా ఉండగా తెలుగులో మాత్రం స్వల్పంగా వసూళ్లు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే టికెట్ రేట్లు తగ్గించడంతో ఈ వారంలో వసూళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్ రికార్డులను క్రాస్ చేయడమే లక్ష్యంగా పుష్ప 2 దూసుకెళ్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతోందో చూద్దాం.


Click it and Unblock the Notifications











