Pushpa 2 Day 8 collection : 1055 కోట్లు ఫినిష్.. కుమ్మిపడేస్తోన్న అల్లు అర్జున్ , 8వ రోజు ఎన్ని కోట్లంటే?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప పార్ట్ 1కి సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. క్లాస్ , మాస్.. ఏ క్లాస్ , సీ క్లాస్ అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా ఏరియాల్లో బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలు కొట్టిన పుష్ప 2.. ఈ ఏడాది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2ని కొట్టేసింది. నెక్ట్స్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ కలెక్షన్ల రికార్డును క్రాస్ చేయాలని పుష్ప రాజ్ దూసుకెళ్తున్నాడు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది పుష్ప 2.

దీంతో ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11000 స్క్రీన్‌లలో డిసెంబర్ 5న రిలీజైంది పుష్ప 2 ది రూల్. తొలి రోజే ఏకంగా రూ. 294 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. అదే జోష్‌తో కేవలం వారం రోజుల్లోనే ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి దుమ్మురేపాడు అల్లు అర్జున్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి ఫస్ట్ వీక్‌లో రూ.343.92 కోట్ల షేర్.. రూ. 660.70 కోట్ల గ్రాస్ అందుకుంది. ఆర్ఆర్ఆర్ రూ. 392.85 కోట్ల షేర్, రూ.710 కోట్ల గ్రాస్... కేజీఎఫ్ 2 రూ. 357 కోట్ల షేర్.. రూ. 719.30 కోట్ల గ్రాస్ రాబట్టాయి. వీటిలో షేర్ పరంగా ఆర్ఆర్ఆర్.. గ్రాస్ పరంగా కేజీఎఫ్ చాప్టర్ 2లు టాప్ ప్లేస్‌లో నిలిచాయి. వీటన్నింటి కంటే బాహుబలి 2 గ్రాస్, షేర్ ఎక్కువ.. ఈ హిస్టారిక్ మూవీ రూ. 430 కోట్ల షేర్, రూ. 835 కోట్ల గ్రాస్ సాధించి దాదాపు ఏడేళ్లుగా తన రికార్డును నిలబెట్టుకుంటూ వచ్చింది. అయితే దీనిని పుష్ప 2 అధిగమించింది. ఈ మూవీ ఫస్ట్ వీక్‌లోనే రూ. 505 .15 కోట్ల షేర్, రూ. 1010 కోట్ల గ్రాస్‌తో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఫ్యూచర్‌లో ఈ రికార్డును కొట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
ఇక 8వ రోజు పుష్ప 2 వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగులో రూ. 10 కోట్లు, హిందీలో రూ. 29 కోట్లు, తమిళనాడులో రూ.2.23 కోట్లు, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలలో రూ. 3 కోట్లు , ఓవర్సీస్‌లో రూ. 5 కోట్లు చొప్పున మొత్తంగా రూ.49 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తంగా 8 రోజుల్లో పుష్ప 2 రూ.1055 కోట్ల గ్రాస్‌ను రాబట్టి విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం నుంచి వీకెండ్ మొదలు కానుండటంతో పుష్ప 2 ది రూల్ మరింత సౌండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











