Pushpa 2 Day 9 collection : కల్కిని కొట్టేసిన పుష్ప2 .. 1100 కోట్లతో బన్నీ హిస్టరీ , నెక్ట్స్ టార్గెట్ RRR
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారంలోనే ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. క్లాస్ , మాస్.. ఏ సెంటర్ , సీ సెంటర్ అన్న తేడా లేకుండా పుష్ప 2 కనక వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ కలెక్షన్ల రికార్డును క్రాస్ చేయాలని పుష్ప రాజ్ వడి వడిగా దూసుకెళ్తున్నాడు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పాటలకు తోడు అల్లు అర్జున్ గెటప్స్‌తో భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచింది.

దీంతో పుష్ప 2కు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించాయి మార్కెట్ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11000 స్క్రీన్‌లలో డిసెంబర్ 5న రిలీజైంది పుష్ప 2 ది రూల్. ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు బన్నీ. వర్కింగ్ డేస్‌లోనూ సాలీడ్ బుకింగ్స్‌తో ఈ సినిమా సత్తా చాటుతోంది. తెలుగులో కంటే హిందీ, ఓవర్సీస్‌లో పుష్ప 2 ప్రభంజనం సృష్టిస్తున్నాడు.
ఇకపోతే.. 9వ రోజు పుష్ప 2 వసూళ్ల విషయానికి వస్తే.. శుక్రవారం మధ్యాహ్నం వరకు బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు సాలీడ్ టికెట్స్ బాగా తెగాయట. శుక్రవారం తెలుగులో రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, హిందీలో రూ. 27 కోట్లు, తమిళ్‌లో రూ. 2 కోట్లు, కర్ణాటక , కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లు చొప్పున మొత్తంగా రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
9వ రోజు నాటి వసూళ్లతో పుష్ప 2 మరో మైలురాయిని అధిగమించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ వసూళ్లను అల్లు అర్జున్ క్రాస్ చేశాడు. కల్కి టోటల్ రన్‌లో రూ. 1061. 5 కోట్ల గ్రాస్‌ను అందుకోగా.. పుష్ప 2 కేవలం 9 రోజుల్లోనే రూ. 1100 కోట్లను రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది. అంతేకాదు.. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా పుష్ప 2 ది రూల్ చరిత్ర సృష్టించింది. శని, ఆదివారాలు ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











