Pushpa 2 Collections: చరిత్ర సృష్టించిన పుష్ప 2.. ఓవర్సీస్‌లో బాహుబలి 2 కలెక్షన్ల రికార్డులు బ్రేక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా 40 రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. రిలీజైన ప్రతీ చోట ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తున్నది. ఇప్పటికే 2 వేల కోట్ల రూపాయల కలెక్షన్లకు చేరువైన ఈ చిత్రం తాజాగా ఓవర్సీస్ మార్కెట్‌లో సత్తా చాటింది. ఈ చిత్రం యూకే, ఐర్లాండ్‌లో ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. బాహుబలి 2 రికార్డును అధిగమించిన సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ సినిమా రికార్డు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఇటీవల అదనంగా చేర్చిన 20 సినిమాతో రిపీట్ ఆడియెన్స్‌ పెరిగారు. దాంతో అన్ని చోట్ల ఈ సినిమా కలెక్షన్లు పెరిగాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ రేంజ్ రన్ కొనసాగించిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

Pushpa 2 The Rule breaks Baahubali 2 Records in UK and Ireland

ఓవర్సీస్‌లోని ప్రధానమైన ఇండియన్ మార్కెట్ ఉన్న యూకే, ఐర్లాండ్‌లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 పేరుపై ఉంది. గత కొన్నేళ్లుగా బాహుబలి 2 రికార్డును తిరగరాసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ పుష్ప 2 సినిమా ఆ మైలురాయిని అధిగమించి సరికొత్త చరిత్రను సృష్టించింది.

యూకే, ఐర్లాండ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా బాహుబలి 2 పేర రికార్డు క్రియేట్ అయింది. ఈ చిత్రం సుమారుగా 1.82 మిలియన్ పౌండ్లు అంటే 19.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు రాజమౌళి సినిమానే రికార్డును మెయింటెన్ చేసింది.

Pushpa 2 The Rule breaks Baahubali 2 Records in UK and Ireland

అయితే పుష్ప 2 మూవీకి ఊహించిన రెస్పాన్స్ రావడంతో సరికొత్త రికార్డులు నమోదు అయ్యాయి. బ్రిటన్, ఐర్లాండ్‌లో అల్లు అర్జున్‌కు ఎదురే లేకుండా పోయింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 1.9 మిలియన్ పౌండ్లు అంటే.. 20.11 కోట్లు రాబట్టింది. దాంతో ఇప్పటి వరకు బాహుబలి మూవీపై ఉన్న రికార్డును తన పేరిట పుష్ప 2 రాసుకొన్నది.

యూకేలో టాప్ కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాల వివరాల్లోకి వెళితే.. RRR 1.04 మిలియన్ పౌండ్లు, కల్కి చిత్రం 1.55 మిలియన్ పౌండ్లు, బాహుబలి 1.82 మిలియన్ పౌండ్స్, పుష్ప 2 సినిమా 1.9 మిలియన్ పౌండ్స్ వసూలు చేశాయి. ఆ తర్వాత స్థానాల్లో సలార్, ఆదిపురుష్ ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X