Pushpa 2 Bussiness: షూటింగ్ పూర్తవ్వకముందే అల్లు అర్జున్ సంచలనం.. ఆ రూట్లో రికార్డు స్థాయిలో లాభాలు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొత్తానికి పుష్ప పార్ట్ 1తో పాన్ ఇండియా స్టార్ గా ఒక సరికొత్త గుర్తింపును అయితే అందుకున్నాడు. అంతేకాకుండా ఐకాన్ స్టార్ అనే సరికొత్త ట్యాగ్ తో కూడా ఇతర భాషల్లో జనాలకు దగ్గరయ్యాడు. పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ అంతకు మించి అనేలా రెండవ భాగం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక సెకండ్ పార్ట్ విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ సినిమా నాన్ థియేట్రికల్ గా దాదాపు పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి తెచ్చేలా లాభాలు అందిస్తున్నట్లు సమాచారం. హాట్ స్టార్ సంస్థ సినిమాతో ఒక డీల్ మాట్లాడుతున్నట్లు టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే..

నమ్మకంతో పాన్ ఇండియా..
అల..వైకుంఠపురములో సినిమా తరువాత అల్లుఅర్జున్ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని మొదటిసారి బిగ్ బడ్జెట్ సినిమా పుష్ప ను తెరపైకి తీసుకువచ్చారు. పుష్ప అసలైతే మొదట కేవలం ఒక భాషలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ మీద నమ్మకంతో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాల్సి వచ్చింది.

హిందీలోనే షాకింగ్ కలెక్షన్స్
అయితే మొదట హిందీలో ఏ మాత్రం ప్రమోషన్స్ చేయక పోయినప్పటికీ కూడా సినిమా విడుదల తర్వాత కేవలం పాజిటివ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సినిమాకు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వచ్చాయి. ముఖ్యంగా హిందీలో అయితే వందకోట్ల నెట్ కలెక్షన్స్ సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

నెగిటివ్ రివ్యూలు ఎన్ని వచ్చినా..
నెగిటివ్ రివ్యూలు ఎన్ని వచ్చినా కూడా పుష్ప సినిమాపై కొంత కూడా ప్రభావం చూపించ లేదు అని చెప్పాలి. ఇక రెండవ భాగం పై అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. ఆ సినిమా షూటింగ్ అయితే దాదాపు 80 శాతం పూర్తయింది. మరికొంత షూటింగ్ వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని దర్శకుడు సుకుమార్ ఆలోచిస్తున్నాడు. అవసరమైతే మరికొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

హాట్ స్టేట్ షాకింగ్ ఆఫర్
అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ శాటిలైట్ హక్కుల కోసం మైత్రి మూవీ మేకర్స్ ను హాట్ స్టార్ డిస్ని ప్లస్ వాళ్ళు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ శాటిలైట్ అన్ని భాషలకు కలిపి మంచి ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 250 కోట్ల వరకు పుష్ప నిర్మాతలకు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో అయితే డిజిటల్ శాటిలైట్ రూపంలో లాభాలను అందించలేదు. మరి ఈ ఆఫర్ కు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లేదో తెలియాలంటే అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.
Recommended Video


పుష్ప 2 రిలీజ్ ఎప్పుడంటే?
ఇక దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ది రూల్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ముందు జరిగినట్లు తొందరపాటులో సినిమాను రిలీజ్ చేయకుండా ప్రమోషన్స్ కోసం కాస్త ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాను వీలైనంత తొందరగా విడుదలకు సిద్ధం చేసి మళ్లీ డిసెంబర్ లోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. లేదంటే 2020 జనవరి 23న విడుదల చేయవచ్చు అని మరొక కొత్త టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











