Pushpa 2 Day 1 Box Office : 250 కోట్ల సంచలనం .. జవాన్, ఆర్ఆర్ఆర్‌లను కొట్టేసిన అల్లు అర్జున్!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్‌లు జంటగా నటించిన పుష్ప 2 ది రూల్‌పై ఆల్ ఇండియా లెవల్‌లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై నార్త్ , సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా భారీ హైప్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన పుష్ప 2 కలెక్షన్స్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. మరి పుష్ప 2 ది రూల్ తొలిరోజు ఏ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిందో చూస్తే :
పుష్ప 2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రమోషన్ కార్యక్రమాలు దీనికి అదనం. ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగపతి బాబు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప 1 భారీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్, టీజర్, అల్లు అర్జున్ లుక్ అన్నీ పుష్ప 2పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, హిందీ, ఓవర్సీస్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డు స్థాయిలో రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రూ. 425 కోట్ల వ్యాపారం చేసింది పుష్ప 2. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూ. 275 కోట్లతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. అలాగే శాటిలైట్ రైట్స్ కింద రూ. 85 కోట్లు, రూ. 65 కోట్లు మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి గతంలో ఏ తెలుగు సినిమాకు జరగని స్థాయిలో వ్యాపారం చేసిందట.
దీంతో రూ. 1200 కోట్ల గ్రాస్ , రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పుష్ప 2కి నిర్దేశించారు ట్రేడ్ పండితులు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే కనీవినీ ఏరుగని రీతిలో వరల్డ్ వైడ్‌గా దాదాపు 11000 వేల స్క్రీన్‌లలో పుష్ప 2ని రిలీజ్ చేశారు మేకర్స్. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్మురేపగా .. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు అల్లు అర్జున్. ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇక తొలిరోజు వసూళ్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా తెలుస్తోంది. కొన్ని ఏరియా లెక్కలు ఇంకా తేలాల్సి ఉన్నందున టోటల్ ఫిగర్ అధికారికంగా రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 90 కోట్లు, హిందీలో రూ. 70 కోట్లు, కర్ణాటకలో రూ. 14 కోట్లు, తమిళనాడు , కేరళ, రెస్టాఫ్ ఇండియాలలో రూ. 20 కోట్లు చొప్పున తొలి రోజు భారత్ వ్యాప్తంగా రూ. 200 కోట్ల కలెక్షన్స్‌ని సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఓవర్సీస్‌లో రూ. 60 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. మొత్తంగా తొలి రోజు పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా రూ. 250 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి కనివినీ ఏరుగని రికార్డు నెలకొల్పింది.
ఇక తొలి రోజు పుష్ప సాధించిన రికార్డుల విషయానికి వస్తే.. హిందీ మార్కెట్‌లో అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (65 కోట్లు) పేరిట ఉండగా.. అల్లు అర్జున్ దానిని బద్ధలుకొట్టాడు. అంతేకాదు.. ఇండియా వైడ్ అత్యధిక ఓపెనింగ్స్ రికార్డు ఆర్ఆర్ఆర్ (160 కోట్లు) పేరిట ఉండగా దీనిని కూడా పుష్ప 2 (190 కోట్లు) క్రాస్ చేసేసింది. అలాగే రెండు భాషల్లో (హిందీ, తెలుగు) ఒకే రోజున రూ. 50 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











