600 కోట్లు కొట్టిన "పుష్ప 2"కి అక్కడ భారీ నష్టాలు? .. ఇంత దారుణంగానా?
ఇటీవల కాలంలో వచ్చిన ఎన్నో చిత్రాల్లో దర్శకుడు సుకుమార్ .. అలాగే తన ఎవర్ గ్రీన్ హీరో అల్లు అర్జున్ తో చేసిన భారీ చిత్రం "పుష్ప 2" తో మళ్ళీ హిట్ కొట్టారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొత్తం నాలుగు చిత్రాల్లో మూడు బిగ్గెస్ట్ హిట్స్ పడ్డాయి. లేటెస్ట్‌గా వచ్చిన చిత్రం "పుష్ప 2" అయితే నేషనల్ వైడ్ గా రికార్డు వసూళ్లతో దంచి కొడుతోంది.
కాగా పుష్ప 2 చిత్రానికి ముందు నుంచే భారీ హైప్ ఉండగా దీనికి రిలీజ్ కి ముందే రూ.1000 కోట్ల బిజినెస్ అంటూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త చాప్టర్‌నే స్టార్ట్ చేసింది. థియేట్రికల్ సహా ఓటిటి, శాటిలైట్ ఇతర డిజిటల్ హక్కులతో కలిపి ఈ మార్క్‌ని చేరుకుంది. దీంతో తెలుగు నుంచి మాత్రమే కాకుండా టోటల్ ఇండియన్ ఇండస్ట్రీలో ఓ సినిమాకి హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా పుష్ప 2 ది రూల్ నిలిచింది.

థియేటర్స్‌లో రిలీజ్‌కి వస్తున్న తరుణంలో మొత్తం ఎన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుందో అన్ని భాషల్లో అల్లు అర్జున్ ప్రమోషన్స్ చేశారు. అలా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మలయాళ భాషల్లో గట్టిగానే ప్రమోట్ చేయగా ఒక్క భాషలో మాత్రమే ఈ సినిమా భారీ నష్టాలు మిగిల్చేలా ఉంది అంటూ ఓ టాక్ ఇపుడు వినిపిస్తుంది.
కాగా హిందీ, తెలుగులో పుష్ప 2 రికార్డు వసూళ్లు అందుకోగా తమిళ్, కన్నడలో కూడా బాగానే ఉన్నాయి. కానీ మలయాళంలో మాత్రం పుష్ప 2 వసూళ్లు దారుణంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్‌ని మలయాళ ప్రేక్షకులు మల్లు అర్జున్ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. పైగా పుష్ప 2లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కూడా ఉన్నప్పటికీ అక్కడ ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ చూపించడం లేదట.

పైగా ఈ సినిమాని అల్లు అర్జున్ చాలా ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇతర భాషల్లో పోలిస్తే కేరళలో మాత్రం పుష్ప 2 బిజినెస్ చాలా దారుణంగా నడుస్తుందట. ఈ సినిమాకి కేరళలో 60 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు రూ. 10 కోట్ల షేర్ కూడా దాటేలా లేదు అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి . అయితే ఇవి నిజం కాదని ఫిలింనగర్ టాక్.
కేరళలో పుష్ప 2కి రూ.20 కోట్ల బిజినెస్ చేస్తే ఈ టార్గెట్‌ని అందుకోవడంలో స్ట్రగుల్ అవుతుంది అనేది నిజం అట. దీనికి కారణం ఫహద్ ఫాజిల్‌ని సరిగ్గా చూపించకపోవడం కూడా అని వినిపిస్తుంది. బహుశా టార్గెట్ రీచ్ అవ్వడమో స్వల్పంగా నష్టాలు రావడమో అయితే పుష్ప 2కి మలయాళ వెర్షన్ లో తప్పదట. మరి మిగతా వరల్డ్ వైడ్ అంతా కేవలం రెండు రోజుల్లోనే 600 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ చిత్రం కేరళలో మాత్రం నష్టాలు చూడటం అనేది ఆశ్చర్యకరం. అది కూడా మలయాళ హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ సినిమా విషయంలో ఇలా జరగడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











