బాక్సాఫీస్ దగ్గర "పుష్ప 2" వసూళ్ల సునామి.. 5 రోజుల్లోనే 1000 కోట్లు
చాలాకాలం తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక తెలుగు సినిమా మరోసారి సత్తా చూపిస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలి 2 అలాగే కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ సీక్వెల్స్ కి మించి ఇపుడు మరో క్రేజీ సీక్వెల్ చిత్రం భారీ రికార్డులు నమోదు చేస్తుంది. ఆ రెండు సినిమాల తరహాలో ఒక ఎగ్జైటింగ్ ఎండింగ్ పార్ట్ 1 కి లేకపోయినప్పటికీ పుష్ప 2పై నెలకొన్న హైప్ పూర్తిగా వేరే లెవెల్ అని చెప్పాలి.
ఇలా పుష్ప 2 రిలీజ్ కి ముందే షూటింగ్ దశలో ఉన్నపుడే 1000 కోట్ల వసూళ్లు కొట్టే సినిమా అవుతుంది అని ముందే అంచనా వేశారు. అన్నట్లుగానే పుష్ప 2 .. రూ 1000 కోట్ల బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. కాగా ఈ క్రమంలోనే పుష్ప 2 కూడా రికార్డు వసూళ్లు సాధిస్తూ.. ఇపుడు కేవలం 5 రోజుల్లోనే ఓ భారీ రికార్డు అందుకుంది.

కాగా డే 1 నుంచే ఇండియా వైడ్ గా ఉన్న అన్ని రికార్డులు తన పేరు మీదకి మార్చేసుకున్న పుష్పరాజ్ ఇపుడు 5 రోజుల్లోనే రూ.900 కోట్లకి పైగా వసూళ్లు క్రాస్ చేసి వరల్డ్ వైడ్ గా కేవలం 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరబోతున్న ఫాస్టెస్ట్ సినిమాగా రికార్డులు సెట్ చేస్తున్నాడు. మేకర్స్ చెబుతున్న దాని ప్రకారం పుష్ప ఈ 5 రోజుల్లోనే రూ.922 కోట్లకి పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసిందట.
కాగా వీటిలో ఒక్క యూఎస్ మార్కెట్ నుంచే 10 మిలియన్‌లకి పైగా వసూళ్లు అంటే రూ.84 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా మిగతా ఓవర్సీస్ దేశాల్లో కలిపి 9 మిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టిందట. అంటే 76 కోట్లకి పైగా గ్రాస్ అందుకుంది పుష్ప 2. ఇలా కేవలం 5 రోజుల్లోనే పుష్ప ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే దాదాపు రూ.150 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని సంచలనం సృష్టించింది.
ఇక హిందీ మార్కెట్ నుంచి ఈ 5 రోజుల్లో రూ.339 కోట్ల నెట్ వసూళ్లు అందుకోవడం విశేషం. ఇలా ఇక్కడే దాదాపు 500 కోట్ల మేర గ్రాస్ వచ్చేసింది. ఇక మన తెలుగు సహా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి మిగతా మొత్తాన్ని రాబట్టింది పుష్ప 2. ఇలా మొత్తంగా పుష్ప రాజ్ వరల్డ్ వైడ్‌గా బీభత్సం సృష్టిస్తున్నాడని చెప్పొచ్చు. ఇక లాంగ్ రన్ లో పుష్ప రాజ్ హవా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రొమాన్స్ చేయగా యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్‌తో ఒక ఊపు ఊపారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో ఈ సినిమాకు పార్ట్ 3ని కూడా మేకర్స్ తీసుకొస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











