Pushpa 20 Days collections తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా.. అక్కడ ఇంకా దంచుడే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం 2021లో బాక్సాఫీస్‌కు జోష్ పుట్టించింది. నిరాశజనకంగా ఉన్న టాలీవుడ్ పరిశ్రమకు ఉత్తేజం కలిగించిన చిత్రాల్లో పుష్ప చిత్రం ముందు వరుసలో ఉంటుంది. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. ఉత్తరాది ప్రేక్షకులకు ఊపు తెచ్చింది. దాంతో ఈ సినిమా సునాయసంగా డిస్టిబ్యూటర్లను లాభాల్లోకి నెట్టింది. ఈ చిత్రం 20వ రోజున ఏ మేరకు వసూళ్లను సాధించిందంటే..

ఓటీటీ రిలీజ్ వార్తలతో
పుష్ప చిత్రం గత కొద్ది రోజులుగా పేలవమైన వసూళ్లను నమోదు చేస్తున్నది. అయితే కరోనావైరస్ భయాందోళనలు ఒక కారణంగా కాగా, ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుందనే వార్త ప్రేక్షకులను థియేటర్‌కు వెళ్లకుండా ఆపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పుప్ప తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ రన్ ముగిసినట్టే అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
పుష్ప చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 36 కోట్లకు, సీడెడ్‌లో 18 కోట్లకు, ఉత్తరాంధ్రలో 12.25 కోట్లకు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్లకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్లకు, గుంటూరు జిల్లాలో 9 కోట్లకు, కృష్ణా జిల్లాలో 7.5 కోట్లకు, నెల్లూరు జిల్లాలో 4 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. తెలంగాణ, ఏపీలో ఈ చిత్రం 102 కోట్ల మేర, కర్ణాటకలో థియేట్రికల్ రైట్స్ 9 కోట్లకు, తమిళనాడులో 6 కోట్ల రూపాయలకు, కేరళలో 4 కోట్ల రూపాయలకు, హిందీలో 10 కోట్ల రూపాయలకు, మిగితా రాష్ట్రాల్లో 1.15 కోట్లకు, ఓవర్సీస్‌లో 13 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 144 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

20వ రోజున పుష్ప వసూళ్లు
పుష్ప చిత్రం 20వ రోజున కూడా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన చూపించింది. నైజాంలో 6 లక్షలు, సీడెడ్‌లో 3 లక్షలు, ఉత్తరాంధ్రలో 1 లక్ష, తూర్పు గోదావరి జిల్లాలో 1 లక్ష, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 లక్షలు, గుంటూరులో 50 లక్షలు రూపాయలు, కృష్ణా జిల్లాలో 1 లక్ష, నెల్లూరులో 40 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 20వ రోజున సుమారుగా 14 లక్షల షేర్‌ను, 25 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది,

మొత్తం 20 రోజుల్లో కలెక్షన్లు ఇలా..
ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 20 రోజుల్లో ఎంత రాబట్టిందనే విషయంలోకి వెళితే.. నైజాంలో 37 కోట్లకుపైగా, సీడెడ్‌లో సుమారు 15 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 4.85 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.95 కోట్లు, కృష్ణాలో 4.20 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.3.10 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 84.2 కోట్ల షేర్, 131 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో 11.30 కోట్లు, తమిళనాడులో 10.50 కోట్లు, కేరళలో 5.27 కోట్లు, హిందీలో 33.15 కోట్లు వసూలు చేసింది. మిగితా రాష్ట్రాల్లో ఈ చిత్రం 2.25 కోట్ల కలెక్ట్ ేసింది. ఇక ఓవర్సీస్‌లో 14.5 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 161.5 కోట్ల షేర్, 303 కోట్ల గ్రాస్ రాబట్టింది.

2021లో అత్యధిక వసూళ్లు సాధిచించిన పుష్ప
ఇక పుష్ప చిత్రం 146 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ వేట ప్రారంభించింది. కేవలం 10 రోజుల్లోనే ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశించింది. ఇప్పటికి 161 కోట్లకుపైగా షేర్‌తో 2021లో అరుదైన వసూళ్లను సాధించింది. దీంతో ఈ చిత్రం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకుపైగా లాభాన్ని నమోదు చేసుకొన్నది. ఇటీవల కాలంలో లాభాలను నమోదు చేసుకొన్న చిత్రాల్లో పుష్ప ఒకటిగా నిలవడం గమనార్హం.

ఆస్ట్రేలియాలో భారీగా వసూళ్లు
పుష్ప ఓవర్సీస్‌లో సాధిస్తున్న కలెక్షన్ల విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో మొదటి వారం 410,617 ఆస్ట్రేలియన్ డాలర్లు, రెండో వారం 49,914, మూడో వారం 71,809 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. మూడు వారాల్లో మొత్తంగా 532,340 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో ఈ చిత్రం 2.85 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. అయితే రెండో వారంలో కంటే మూడో వారంలో పుష్ప కలెక్షన్లు పుంజుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

మూడోవారంలో న్యూజిలాండ్‌లో పుష్ప
ఇక న్యూజిలాండ్‌లో పుష్ప పరిస్థితి బ్రహ్మండంగా ఉంది. తొలివారంలో 33,596 న్యూజిలాండ్ డాలర్స్ కలెక్ట్ చేసింది. రెండోవారం 1,201 డాలర్లకు మాత్రమే పరిమితమైంది. రెండువారాల్లో 34,797 డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో 17.54 లక్షలు వసూలు చేసింది. ప్రేక్షకుల నుంచి డిమాండ్ రావడంతో ఈ సినిమాను మూడో వారంలో మరోసారి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Recommended Video

ఫిజీ దేశంలో పెరిగిన థియేటర్లు
ఇక ఫిజి దేశంలో కూడా పుష్ప చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నది. తొలివారంలో 2,572 ఫిజి డాలర్లను, రెండో వారంలో 6,311 డాలర్లు, మూడో వారంలో 10,552 డాలర్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 19,435 డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో 6.81 లక్షలు వసూలు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రెండో వారాలతో పోల్చితే మూడో వారంలో ఎక్కువ థియేటర్లను, స్క్రీన్లను పెంచడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పుట్టించింది.


Click it and Unblock the Notifications











