బాలయ్య తోపు అంటూ మీసం మెలేస్తున్న ఫ్యాన్స్.. పవన్, బన్నీని వెనక్కు నెట్టి మరీ?
ఫాలోయింగ్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో మరెవ్వరికీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఏ హీరోకి ఆ హీరోకి తగ్గట్టుగా అభిమానగణం ఉంది. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన ఈ ఇద్దరు హీరోలకు మాత్రం అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. అయితే ఎంత అభిమానుల్లో క్రేజ్ ఉన్నా బాలకృష్ణ అఖండ సినిమా కలెక్షన్లు మాత్రం వాళ్ళిద్దరూ దాట లేకపోయారు అనే చర్చ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది. ఈ విషయం బయటకు రావడంతో మా బాలకృష్ణ తోపు అంటూ ఆయన అభిమానులు మీసం మెలేస్తూన్నారు. ఆ వివరాల్లోకి వెళితే

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కంటే
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కంటే నందమూరి బాలకృష్ణ పెద్ద. కేవలం వయసులో మాత్రమే కాదు పాపులారిటీ పరంగా, కలెక్షన్ల పరంగా కూడా వారిద్దరినీ బాలయ్య డామినేట్ చెయ్యటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. ఇటీవల విడుదలైన పుష్ప, భీమ్లా నాయక్ చిత్రాలు అఖండ కలెక్షన్‌లను బీట్ చేయడంలో విఫలమయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం. బాలకృష్ణకు ఈ సీడెడ్ లో బలమైన మార్కెట్ ఉంది.

బాక్సాఫీస్ బొనాంజాగా
ఆ దెబ్బతో ఆయనకు ఉన్న బాక్సాఫీస్ బొనాంజాగా తన బిరుదును నిలబెట్టుకునే విధంగా అఖండ సినిమా వసూళ్ళు ఉన్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా మేరకు అఖండ సీడెడ్లో 15 కోట్ల షేర్ వసూలు చేసింది అంటే పుష్ప కంటే కాస్త ఎక్కువే. వారం క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా అఖండ సృష్టించిన మ్యాజిక్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. భీమ్లా నాయక్ ఈ రికార్డును బీట్ చేయడం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది.

పుష్ప ఎలాగోలా
ఎందుకంటే ఆ సినిమా ఇప్పటికే ఇక్కడ మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద కష్టపడుతోంది. చిత్తూరు బ్యాక్‌డ్రాప్ కారణంగా పుష్ప ఎలాగోలా భారీ వసూళ్లు రాబట్టగలిగింది. అఖండ చాలా సెంటర్లలో లోటు లేకుండా 5-6 వారాల పాటు సెడెడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ రన్ సాధించింది. బాలకృష్ణ గతంలో చేసిన రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు ఆయనకు బాగా హెల్ప్ అయ్యాయి.

చర్చనీయాంశం
ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం హిందూపూర్ కూడా ఈ ప్రాంతం నుంచే ఉండడం వల్లే ఇక్కడ ఆయనకు మంచి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. దానికి తగ్గట్టు సూపర్ క్రేజ్ ఉన్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా భారీ కలెక్షన్లు రావడానికి ప్రధాన కారణం. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అవుతోంది.

బిజీబిజీగా
ఒకరకంగా పెద్ద హీరోలు కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఈ దెబ్బతో సంకేతాలు పంపినట్లు అయ్యింది. మరో పక్క ముగ్గురు హీరోలు కూడా ఎవరి సినిమా షూటింగ్ బిజీలో వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి అల్లుఅర్జున్ ఒక్కరే రెస్ట్ మోడ్ లో ఉన్నారు. బాలకృష్ణ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క తమతమ సినిమా షూటింగులలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











