Pushpa Hindi collections: తెలుగు కలెక్షన్స్ దాటేసి అరాచకం.. హిందీ బాక్సాఫీస్ స్వైరవిహారం.. రికార్డు నమోదు!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మిగతా అన్ని భాషల కంటే కూడా హిందీలో ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకుంటూ రికార్డులు బద్దలు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

వసూళ్లపై ప్రభావం

వసూళ్లపై ప్రభావం

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' సినిమా క్రితం నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజున ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో వసూళ్లపై ఆ ప్రభావం పడుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే మన దగ్గర సినిమా ఎలా ఉన్నా హిందీ ఆడియన్స్ మాత్రం దీన్ని బాగా ఆదరిస్తున్నారు.

15 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో

15 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో

హిందీ వెర్షన్ లో సినిమా 15 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. హిందీలోకి అనువాదమైన బన్నీ సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయన సినిమాలు ఎక్కువగా హిందీ డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా అక్కడి ప్రేక్షకులకు బన్నీ బాగా తెలియడంతో పుష్పకు మంచి రీచ్ లభిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్ లో కరోనా ప్రభావం లేకపోతే ఈ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు.

తరణ్ ఆదర్శ్ ఆసక్తికర ట్వీట్

తరణ్ ఆదర్శ్ ఆసక్తికర ట్వీట్

పుష్ప 16వ రోజు వసూళ్ల గురించి ప్రముఖ హిందీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పుష్ప సంచలనాత్మకంగా ఉంది, అనేక పరిమితులు ఉన్నప్పటికీ, పుష్ప హిందీ రోజు 16 అత్యధిక సింగిల్ డే సంఖ్యను నమోదు చేసింది. ఇది ఒక కేస్ స్టడీ అని పేర్కొన్న ఆయన 50 కోట్ల మార్క్ దాటి ₹ 75 కోట్ల దిశగా వేగంగా దూసుకుపోతోందని అన్నారు.

సాలిడ్ కంటెంట్ కి ఉన్న పవర్

సాలిడ్ కంటెంట్ కి ఉన్న పవర్

సాలిడ్ కంటెంట్ కి ఉన్న పవర్ అని చెబుతూ [3వ వారంలో] శుక్రవారం 3.50 కోట్లు, శనివారం 6.10 కోట్లు. మొత్తం: ₹ 56.69 కోట్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ అన్నారు. ఒకరంగా 16వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.23 కోట్లు షేర్, రూ. 3.60 కోట్లు గ్రాస్ వచ్చింది. దానికంటే ఎక్కువగా హిందీలో ఈ సినిమా వసూళ్లు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి రూ. 101.85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. కర్నాటకలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 4 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి విడుదలైంది. ఇక హిందీలో రూ. 10 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 14.15 కోట్ల ధర పలికింది. ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 144.90 కోట్ల బిజినెస్ చేసింది. మిగతా చోట్ల సంగతి ఎలా ఉన్నా హిందీ బయ్యర్లు మాత్రం భలే లాభాలు వెనకేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X