Pushpa Day 17 collections 300 కోట్ల క్లబ్‌లోకి అల్లు అర్జున్.. హిందీలో 75 కోట్లు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొలి ప్యాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. మూడో వారంలో కూడా ఏ మాత్రం తగ్గేది లేదనే సంకేతాలను ఇస్తూ వసూళ్లను కురిపిస్తున్నది. అవలీలగా 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం త్వరలోనే 300 కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరే అవకాశం కనిపిస్తున్నది. ఇక 17 రోజుల తర్వాత పుష్ప కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉందంటే?

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఎంతంటే?
పుష్ప చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో 36 కోట్లకు, సీడెడ్‌లో 18 కోట్లకు, ఉత్తరాంధ్రలో 12.25 కోట్లకు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్లకు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్లకు, గుంటూరు జిల్లాలో 9 కోట్లకు, కృష్ణా జిల్లాలో 7.5 కోట్లకు, నెల్లూరు జిల్లాలో 4 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. తెలంగాణ, ఏపీలో ఈ చిత్రం 102 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది.

ఓవర్సీస్, ఇండియా వైడ్ ప్రీ రిలీజ్ ఎంతంటే?
పుష్ప ప్యాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగేతర రాష్ట్రాల్లో కూడా భారీగా బిజినెస్ చేసింది. కర్ణాటకలో థియేట్రికల్ రైట్స్ 9 కోట్లకు, తమిళనాడులో 6 కోట్ల రూపాయలకు, కేరళలో 4 కోట్ల రూపాయలకు, హిందీలో 10 కోట్ల రూపాయలకు, మిగితా రాష్ట్రాల్లో 1.15 కోట్లకు, ఓవర్సీస్‌లో 13 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 144 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

17వ రోజున పుష్ప కలెక్షన్లు..
డిసెంబర్ 17 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 17 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకొన్నది. 17వ రోజున పుష్ప చిత్రం నైజాంలో 84 లక్షలు, సీడెడ్‌లో 61 లక్షలు, ఉత్తరాంధ్రలో 29 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 12 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 లక్షలు, గుంటూరు జిల్లాలో 11 లక్షలు, కృష్ణా జిల్లాలో 10 లక్షలు, నెల్లూరు జిల్లాలో 7 లక్షలు వసూలు చేసింది. 17వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 2.23 కోట్లు నికరంగా, 3.6 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

17 రోజుల మొత్తం కలెక్షన్లు..
ఇక పుష్ప 17 రోజుల మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 36.20 కోట్లు, సీడెడ్‌లో 14 కోట్లు, ఉత్తరాంధ్రలో 7.65 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 4.64 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.80 కోట్లు, గుంటూరులో 4.88 కోట్లు, కృష్ణా జిల్లాలో 4 కోట్లు, నెల్లూరులో 3 కోట్లు రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 81.35 కోట్ల నికర వసూళ్లు, 126 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తెలుగేతర రాష్ట్రాల్లో
ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే.. కర్ణాటకలో 11 కోట్ల రూపాయలను, తమిళనాడులో 10 కోట్ల రూపాయలను, కేరళలో 5 కోట్ల రూపాయలను, మిగితా రాష్ట్రాల్లో 2.20 కోట్లు, ఓవర్సీస్‌లో 13 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు నికరంగా.. 274 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

హిందీ వెర్షన్ వసూళ్లు ఎంతంటే
పుష్ప హిందీ వెర్షన్ గురించిన వివరాల్లోకి వెళితే.. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా అల్లు అర్జున్ మూవీ థియేట్రికల్ రిలీజ్ జరిగింది. అయితే తొలి రోజు నుంచే భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం త్వరలోనే 75 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరుకొనే అవకాశం ఉంది. మూడో వారంలో శుక్రవారం రోజున 3.5 కోట్లు, శనివారం 6.10 కోట్లు, ఆదివారం మరో 4.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 61 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Recommended Video

పుష్పకు లాభం ఎంతంటే?
పుష్ప చిత్రం విడుదలైన అన్ని చోట్ల దాదాపు లాభాల్లోకి చేరుకొన్నది. టికెట్ల రేట్ వివాదం కొనసాగుతున్న ఆంధ్ర ప్రదేశ్‌లోను, అలాగే యూఎస్‌లో కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ప్రపంచవ్యాప్తంగా 146 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ పరుగు ప్రారంభించిన ఈ చిత్రం 150 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. అంటే ఈ చిత్రం 5 కోట్ల లాభాలతో ముందుకెళ్తున్నది. రానున్న రోజుల్లో కూడా ఈ చిత్రం మరింత లాభాలను వసూలు చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రం 300 కోట్లు, హిందీలో 75 కోట్ల మార్కును చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











