twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa Day 18 collections పుష్పను భారీ దెబ్బ కొట్టిన ఆ రెండు అంశాలు.. 70 శాతం కలెక్షన్లు డ్రాప్

    |

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రంపై కరోనావైరస్ గట్టిగానే దెబ్బ పడినట్టు కనిపిస్తున్నది. గత కొద్ది వారాలుగా భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం కొద్ది రోజులుగా బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. 18వ రోజున పుష్ప చిత్రానికి సంబంధించిన కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మొత్తం 18 రోజులు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

    70 శాతం క్షీణించిన కలెక్షన్లు

    70 శాతం క్షీణించిన కలెక్షన్లు

    పుష్ప చిత్రం 18వ రోజున దారుణమైన కలెక్షన్లను సాధించింది. ట్రేడ్ అనలిస్టులు ఊహించిన దాని కంటే ఈ చిత్రం గత కొద్ది రోజుల వసూలు చేసిన కలెక్షన్ల కంటే దాదాపు 70 శాతం క్షీణించాయి. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ముగిసిందా అనే అనుమానాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉందనే విషయాన్ని తాజా వసూళ్లు నిరూపించాయి.

    ఓటీటీ రిలీజ్, టికెట్ ధర పెంపు ప్రభావం

    ఓటీటీ రిలీజ్, టికెట్ ధర పెంపు ప్రభావం

    అయితే పుష్ప వసూళ్లు భారీగా క్షీణించడానికి కారణం ఓటీటీలో రిలీజ్ అవుతుందనే వార్త ఓ కారణం కాగా, ఇటీవల పెంచిన టికెట్ రేట్లు మరో కారణమని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మూడో వారంలో ఈ సినిమా టికెట్ ధర 200 నుంచి 300పైగానే ఉండటంతో ప్రేక్షకులు ముఖం చాటేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    ఆంధ్రా, తెలంగాణలో 18వ రోజు

    ఆంధ్రా, తెలంగాణలో 18వ రోజు

    ఇక పుష్ప 18వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 14 లక్షలు, సీడెడ్‌లో 8 లక్షలు, సీడెడ్‌లో 8 లక్షలు, ఉత్తరాంధ్రలో 3 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 లక్ష, గుంటూరులో 2 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 2 లక్షలు, నెల్లూరులో 1 లక్ష రూపాయలు వసూలు చేసింది. దీంతో 33 లక్షల నికరంగా, 50 లక్షలు గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల కలెక్షన్లు

    అలాగే పుష్ప మూవీకి సంబంధించిన మొత్తం 18 రోజుల్లో తెలుగు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో37 కోట్లు, సీడెడ్‌లో 15 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 4.75 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.90 కోట్లు, గుంటూరులో 5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 4.13 కోట్లు, నెల్లూరులో 3.05 కోట్లు రూపాయలు వసూలు చేసింది. దీంతో 83.80 కోట్లు నికరంగా, 130 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ప్రపంచవ్యాప్తంగా ఎంత షేర్ అంటే..

    ప్రపంచవ్యాప్తంగా ఎంత షేర్ అంటే..

    పుష్ప తెలుగేతర రాష్ట్రాల్లో వసూళ్ల విషయానికి వస్తే.. కర్ణాటకలో 11.22 కోట్లు, తమిళనాడులో 10.43 కోట్లు, కేరళలో 5.23 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 5.23 కోట్లు, హిందీలో 18 వ రోజు సాధించిన 2.68 కోట్లతో కలిసి 31 కోట్లు సాధించింది. ఇక ఓవర్సీస్‌లో 14.15 కోట్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం 158.03 కోట్లు నికరంగా, 298 కోట్ల గ్రాస్ వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

    Recommended Video

    Pushpa Collections : AP Govt Decision Effects Pushpa
    బ్రేక్ ఈవెన్, లాభం ఎంతంటే?

    బ్రేక్ ఈవెన్, లాభం ఎంతంటే?

    పుష్ప సినిమా ఓవరాల్ లాభనష్టాల విషయానికి వస్తే.. ఆంధ్రా ప్రాంతంలో ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నది. ఈ సినిమా సుమారు 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ రన్ ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 158 కోట్లకుపైగా రాబట్టింది. దీంతో ఈ చిత్రం 12 కోట్లకుపైగా లాభాన్ని రాబట్టింది.

    English summary
    Allu Arjun's Pushpa Day 18 collections Worldwide: Trade analyst predicts that, Pushpa will collect approx. 298 crores gross worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X