Pushpa Day 2 USA collections..చరిత్ర సృష్టించిన పుష్ప.. రెండో రోజే అలాంటి ఘనత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఊహించినట్టుగానే భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. సినిమాపై డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం సినిమాను చూసేందుకు ఉత్సాహ పడుతున్నట్టు అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్లు చెప్పకనే చెబుతున్నాయి. అయితే సుకుమార్ టేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న ప్రేక్షకులు సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు. అయితే అమెరికాలో పుష్ప రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

అమెరికాలో 3500 స్క్రీన్లలో
అమెరికాలో పుష్ప చిత్రం అత్యధిక స్క్రీన్లలో రిలీజైంది. సుమారు వెయ్యి థియేటర్లలో 3500 స్క్రీన్లలో, 100 డౌల్బీ స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. ప్రతీ థియేటర్‌లో కూడా ప్రతీ రోజు 10కి పైగా షోలు వేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో అమెరికాలో భారీ రేంజ్‌లో విడుదలైన సినిమాల్లో పుష్ప ఒకటిగా నిలిచింది.

తొలి రోజున రికార్డు కలెక్షన్లు
పుష్ప తొలి రోజున భారీగా వసూళ్లను రాబట్టింది. దేశవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సినిమాతో పోటీ పడుతూ గట్టిగా కలెక్షన్లను సాధించింది. తొలి రోజు పుష్ప చిత్రం 55 కోట్లు సాధించడం విశేషంగా మారింది. 2021లో దేశవ్యాప్తంగా తొలి రోజు అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రాల వివరాల్లోకి వెళితే. వకీల్ సాబ్ 46.50 కోట్లు, స్పైడర్ మ్యాన్ 41.5 కోట్లు, మాస్టర్ 40 కోట్లు, అన్నాతే 35 కోట్లు, సూర్యవంశీ 31.4 కోట్లు రాబట్టాయి.

అమెరికాలో లాభాల్లోకి రావాలంటే..
ఇక పుష్ప అమెరికా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో 23 కోట్ల రూపాయలకుపైగా బిజినెస్ జరిగితే.. అమెరికాలో మొత్తంగా 18 కోట్లకుపైగా బిజినెస్ నమోదైంది. దాదాపు 20 కోట్ల రూపాయల బిజినెస్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ యాత్ర మొదలైంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 2.7 మిలియన్ డాలర్లు సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తొలి రోజు వసూళ్లు ఇలా
పుష్ప చిత్రం అమెరికాలోని 260 లొకేషన్లలో ప్రీమియర్స్ రూపంలో 530737 డాలర్లు (రూ.4 కోట్లకుపైగానే) తొలి రోజున 89 లోకేషన్లలో 60008 డాలర్లు (4.5 లక్షలకుపైగానే) వసూలు చేసింది. అంటే మొత్తంగా 590,745 డాలర్లు అంటే 4.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
Recommended Video

రెండో రోజున 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో
పుష్ప సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా హవా కొనసాగింది. రెండో రోజునే అల్లు అర్జున్ 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిపోయాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం రెండో రోజున మరో 5 లక్షల డాలర్లను వసూలు చేసినట్టు సమాచారం. దాంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిలియన్ డాలర్ల క్లబ్ చేరడంతో అల్లు అర్జున్ మూవీ సత్తా తెలిసిపోయింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు 8 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











